తండ్రి చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వీడియో రికార్డు చేసిన కొడుకు.. కానీ ఆ వీడియో చూసి షాక్!..
ABN , First Publish Date - 2023-06-30T11:17:17+05:30 IST
తండ్రి చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ కొడుకు రహస్యంగా ఫోన్లో కెమెరా ఆన్ చేసి అతని రూంలో పెట్టాడు. కానీ ఆ తర్వాత ఫోన్లో రికార్డైంది చూశాక ఆ కొడుకుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజానికి సదరు తండ్రి అక్కడ చేసింది చేతబడి కాదు. కానీ, అంతకుమించే చేశాడు.
ఢిల్లీ: తండ్రి చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ కొడుకు రహస్యంగా ఫోన్లో కెమెరా ఆన్ చేసి అతని రూంలో పెట్టాడు. కానీ ఆ తర్వాత ఫోన్లో రికార్డైంది చూశాక ఆ కొడుకుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజానికి సదరు తండ్రి అక్కడ చేసింది చేతబడి కాదు. కానీ, అంతకుమించే చేశాడు. అసలు ఆ వీడియోలో తన కళ్లతో చూస్తున్నది నిజమో? కాదో? తెలియక.. దానిని నిర్ధారణ చేసుకోవడానికి అతనికి సమయం పట్టింది. తన తండ్రి ఇలాంటి వాడని తెలిసి ఏం చేయాలో తెలియక తనలో తానే సిగ్గుపడ్డాడు. విషయం వెంటనే బయటికి చెప్పలేక ఆ వీడియోను కొంతకాలం దాచిపెట్టాడు. కానీ ఇంతలోనే ఏం అయిందో ఏమో కానీ ఆ వీడియోను కొడుకే స్వయంగా బయటపెట్టాడు. దీంతో సదరు తండ్రి బండారం బయపడింది. కానీ వీడియోను దాచి, షేర్ చేసినందుకు తండ్రితోపాటు కొడుకు కూడా జైలుపాలయ్యాడు.
అసలు ఆ వీడియోలో ఏం ఉందంటే.. 68 ఏళ్ల అతని వృద్ధ తండ్రి 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్‌లోనే ఈ ఘటన జరిగినప్పటికీ 40 ఏళ్ల ఆ కొడుకు ఈ వీడియోను బయటపెట్టక పోవడంతో విషయం బయటికి రాలేదు. కానీ జూన్ 27న ఆ వీడియోను రికార్డు చేసిన వ్యక్తే బాలిక తండ్రికి పంపించాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితోపాటు వీడియోను రికార్డు చేయడమే కాకుండా, దాచిపెట్టి ఇతరులకు షేర్ చేసినందుకు అతని కొడుకును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని బురారీలో జరిగిందీ దారుణ ఘటన.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 68 ఏళ్ల వృద్ధుడు మైనర్ బాలిక ఉండే హౌసింగ్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నాడు. పక్కపక్కనే ఇళ్లు కావడంతో ఆ వృద్దుడు తరచుగా బాలిక ఇంటికి వెళ్లేవాడు. వాళ్లతో అధ్యాత్మిక యాత్రలకు కూడా వెళ్తుండేవాడు. ఒంటరిగా ఉండే సమయం కోసం వేచి చూశాడు. ఏప్రిల్ నెలలో ఓ రోజు వీధిలో ఉన్న బాలికను తన ఇంటికి పిలిచాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. దీంతో సదరు బాలిక ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇలా పలుమార్లు అత్యాచారాని పాల్పడ్డాడు.
అయితే ఆ వృద్దుడి కొడుకుకు తన తండ్రి చేతబడి చేస్తున్నాడని అనుమానం కల్గింది. దీంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఉద్దేశంతో రూంలో రహస్యంగా వీడియో రికార్డు పెట్టాడు. దీంతో లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటన రికార్డైంది. కొంతకాలంపాటు వీడియోను దాచినప్పటికీ జూన్ 27న బాలిక తండ్రికి చూపించాడు. దీంతో ఈ దారుణం బయటపడింది. అయితే వృద్ధుడికి అతనికి కొడుకుకు సత్సబంధాలు లేవని పోలీసులు తెలిపారు. అలాగే ఆ వీడియో ఉన్న ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. తండ్రి కొడుకులిద్దరినీ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.