Crime News: అర్ధరాత్రి.. బైక్‌పై భర్త.. వెనక కూర్చున్న భార్య చేతిలో మూడు సంచులు.. వాటిల్లో ఏమున్నాయన్నది బయటపడటంతో..
ABN , First Publish Date - 2023-04-25T15:21:47+05:30 IST
వివాహేతర సంబంధాలు కుటుంబాలను నిట్టనిలువునా చీల్చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రియుడి మోజులో పడి భర్తలను చంపేసిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.
‘‘మాయమైపోతున్నాడమ్మ.. మనిషన్నవాడు’’ అని ఒక కవి అన్నాడు. నేటి పరిస్థితిలు కూడా అలానే ఉన్నాయి. రోజు రోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మనిషిని మనిషే అంత మొందించేస్తున్నాడు.
వివాహేతర సంబంధాలు కుటుంబాలను నిట్టనిలువునా చీల్చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రియుడి మోజులో పడి భర్తలను చంపేసిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భర్త సహకారంతో ప్రియుడ్నే హత మార్చింది ఓ వివాహిత. ఈ సంఘటన ఝార్ఖండ్ (Jharkhand)లో చోటుచేసుకుంది.
తన భార్య (woman)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని (lover) అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త (husband). ఈ ఘాతుకానికి అతని భార్య కూడా సహకరించడం విశేషం. ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.
సోనారీ ప్రాంతానికి చెందిన కమలాకాంత్ సాగర్, ఖుష్బూ సాగర్ దంపతులు. ఒడిశాలోని రాయరంగ్పుర్ ప్రాంతానికి చెందిన విక్కీ అలియాస్ దమృధర్ మహంతికి ఖుష్బూ సాగర్‌తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఉన్నట్టుండి అతడు కొన్ని రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో తన భర్త విక్కీ ఈ నెల 13 నుంచి కనిపించడం లేదంటూ అతడి భార్య ఇనుశ్రీ మహంతి రాయరంగ్పుర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఖుష్బూ సాగర్, ఆమె భర్త కమలాకాంత్ సాగర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో విక్కీని చంపింది తామేనని భార్యాభర్తలిద్దరూ అంగీకరించారు. విక్కీని హత్య చేశాక మృతదేహాన్ని 3 ముక్కలుగా నరికినట్లుగా తెలిపారు. తల, మొండెం, కాళ్లను మూడు సంచుల్లో ఉంచి మూడు చోట్ల పడేసినట్లు నిందితులు తెలిపారు.