Crime: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య.. కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది..
ABN , First Publish Date - 2023-08-28T15:29:22+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని బండాలో(Uttar Pradesh's Banda) దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసింది ఓ భార్య.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బండాలో(Uttar Pradesh's Banda) దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసింది ఓ భార్య. ఈ ఘటనలో వారిద్దరికీ మరో వ్యక్తి కూడా సహకరించాడు. ఈ దారుణ ఘటన ఆగష్టు 23న జరిగింది. చనిపోయిన వ్యక్తిని కైరీ(Kairi) గ్రామానికి చెందిన బాల్కరన్‌గా(Balkaran) గుర్తించారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ ఘటనకు ప్రియుడితో అక్రమ సంబంధం మాత్రమే కారణం కాదు. అసలు కారణం వేరే ఉంది. అదేటంటే.. ప్రియుడి సోదరుడిని చంపాడనే కారణంతో భర్తను భార్య చంపేసింది. పూర్తి వివరాల్లో వెళ్తే.. 2005లో భార్య ప్రియుడి సోదరుడిని ఓ విషయమై బాల్కరన్ చంపేశాడు. దీంతో అతనికి కోర్టు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తి చేసుకుని బాల్కరన్ 2023 జనవరిలో ఇంటికి వచ్చాడు.
దీంతో అప్పటి నుంచి బాల్కరన్‌ను చంపేందుకు భార్య, ఆమె ప్రియుడి వ్యూహం పన్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ఈ నెల 23న భార్య, ప్రియుడు, ప్రియుడి సహచరుడు కలిసి బాల్కరన్‌ను కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హత్య జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం విచారణ చేపట్టారు. విచారణలో నేరం జరిగిన ప్రదేశం, మృతదేహం లభించిన ప్రదేశం వేర్వేరుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే బాల్కరన్ భార్య సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా విచారణలో తేలింది. అలాగే భార్య ఫోన్ కాల్స్‌ను కూడా పరిశీలించగా పోలీసులకు అనుమానం కల్గింది. దీంతో అనుమానంతో భార్యను విచారించగా అసలు విషయం బయపడింది. బాల్కరన్‌ను తామే చంపినట్లు పోలీసుల విచారణలో భార్య అంగీకరించింది. అలాగే బాల్కరన్ చంపిన వ్యక్తి సోదరుడితో సంబంధం ఉన్నట్టు కూడా ఒప్పుకుంది. దీంతో భార్య, ఆమె ప్రేమికుడు, అతని సహచరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.