Education: ఏపీలో మళ్లీ ట్యాబ్‌ మేళా! బైజూస్‌ కంటెంట్‌కే జగన్‌ సర్కార్ జై?

ABN , First Publish Date - 2023-08-23T11:35:54+05:30 IST

జగన్‌ సర్కారు (Jagan Government) మరోసారి ‘ట్యాబ్‌ మేళా’ మొదలుపెట్టింది. రూ.15వేల ‘అమ్మ ఒడి’లో (Amma odi) రెండు వేలు కోత పెట్టి... 8వ తరగతి విద్యార్థులకు ఆ మొత్తాన్నీ ఇవ్వకుండా గరిష్ఠంగా 9వేల విలువైన ట్యాబ్‌లతో (Tab) సరిపెట్టిన తంతు మరోసారి పునరావృతమవుతోంది.

Education: ఏపీలో మళ్లీ ట్యాబ్‌ మేళా! బైజూస్‌ కంటెంట్‌కే జగన్‌ సర్కార్ జై?

ఈసారి రూ.750 కోట్లతో 5 లక్షల ట్యాబ్‌లు

గత ఏడాదికంటే 250 కోట్లు అదనం

జ్యుడీషియల్‌ రివ్యూకు డాక్యుమెంట్‌

అనేక అనుమానాస్పద నిబంధనలు

వ్యక్తులూ పాల్గొనేలా వెసులుబాటు

అస్మదీయుల కోసమే అనే సందేహం

కాలం చెల్లిన స్పెసిఫికేషన్లతో ట్యాబ్‌లు

మళ్లీ బైజూస్‌ కంటెంట్‌కే జగన్‌ జై?

8 నెలలుగా రహస్యంగా ఉత్తర్వులు

టెండర్‌ నిబంధనల్లో వింతలెన్నో..

  • వ్యక్తులూ టెండర్‌లో పాల్గొనవచ్చు

  • ఏడేళ్ల కిందటి మైక్రో యూఎస్‌బీ కేబుల్‌తో

  • చార్జింగ్‌ అయ్యే ట్యాబ్‌లే కావాలి

  • ర్యామ్‌ 3జీబీ, అంతర్గత స్టోరేజీ 32జీబీ చాలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు (Jagan Government) మరోసారి ‘ట్యాబ్‌ మేళా’ మొదలుపెట్టింది. రూ.15వేల ‘అమ్మ ఒడి’లో (Amma odi) రెండు వేలు కోత పెట్టి... 8వ తరగతి విద్యార్థులకు ఆ మొత్తాన్నీ ఇవ్వకుండా గరిష్ఠంగా 9వేల విలువైన ట్యాబ్‌లతో (Tab) సరిపెట్టిన తంతు మరోసారి పునరావృతమవుతోంది. ఈ సారి బడ్జెట్‌ ఎంతో తెలుసా? రూ.750 కోట్లు. గత ఏడాది కంటే రూ.250 కోట్లు అధికం! 5 లక్షల ట్యాబ్‌ల కొనుగోలుకు ఓపెన్‌ కాంపిటీటివ్‌ బిడ్‌ (ఓసీబీ)కింద టెండర్లు పిలవనున్నారు. ఈ టెండర్‌ డాక్యుమెంట్‌ను జ్యుడీషియల్‌ కమిషన్‌ ఆమోదం కోసం పంపించారు. టెండర్‌ డాక్యుమెంట్‌లో ప్రస్తావించిన కొన్ని నిబంధనలు, క్లాజులను పరిశీలిస్తే... ఈ టెండరును అస్మదీయులకు కట్టబెట్టడం ఖాయమని ఎనిమిదో తరగతి పిల్లోడికి కూడా అర్థమవుతుంది. పీకల్లోతు అప్పులు, వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, లెక్కతేలని రుణాలు, ఖర్చుల సమస్యతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎడ్‌టెక్‌ కంపెనీ... బైజూస్‌! ఎందుకో, ఏమో గానీ బైజూస్‌ అంటే ముఖ్యమంత్రికి ఎంతో ప్రేమ. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ట్యూషన్‌లు చెప్పే ఈ సంస్థ కంటెంట్‌ బాగుందని సీఎంకు ప్రగాఢ నమ్మకం! అలాంటప్పుడు... సామాజిక బాధ్యతగా నేరుగా బైజూస్‌ ప్రతినిధులు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకో గంటపాటు ట్యూషన్‌లు చెప్పమని కోరవచ్చు. అలా కాకుండా ఆ సంస్థ బోధించే ట్యూషన్ల కంటెంట్‌ ఉన్న ట్యాబ్‌లు కొనాలని గత ఏడాది నిర్ణయం తీసుకున్నారు. అయితే, అప్పటికే ఆ సంస్థ పీకల్లోతు అప్పుల్లోకి వెళ్లిపోయింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతిలో ఉన్న 4,48,718 మంది విద్యార్థులకు బైజూస్‌ ట్యూషన్‌ కంటెంట్‌ ఉన్న ఆండ్రాయిడ్‌ ట్యాబ్‌లు కొన్నారు. అప్పట్లోనే దీనిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దివాలాదశలో ఉన్న బైజూ్‌సకు మేలు చేసేందుకే 500 కోట్ల విలువైన ట్యాబ్‌ టెండర్‌ను సర్కారు తీసుకొచ్చిందని విద్యార్థి సంఘాలు, నిపుణులు ఆరోపించారు. ఇది ఇక్కడితో ఆగదని... ప్రతిఏటా 5 లక్షల ట్యాబ్‌లు కొంటారని ‘ఆంధ్రజ్యోతి’ అప్పుడే చెప్పింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. పైగా... గత ఏడాది రూ.500 కోట్లుగా ఉన్న బడ్జెట్‌, ఇప్పుడు ఏకంగా రూ.750 కోట్లకు పెరిగింది.

ఈసారి అస్మదీయులకేనా?

గత ఏడాది బైజూస్‌ కంటెంట్‌ ఉన్న శామ్‌సంగ్‌ ట్యాబ్‌లు కొన్నారు. వీటిలో బైజూస్‌ కంటెంట్‌ను ప్రీలోడెడ్‌ (ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసి)గా ఇచ్చారు. ఇందులో తప్పేం ఉంది, బైజూ్‌సకు వచ్చే లాభం ఏమిటి? అని అనుకోవచ్చు. సర్కారు కూడా ఇదే గిమ్మిక్కు చేస్తోంది. నిజానికి శాంసంగ్‌ ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ లోడ్‌ చేయాలంటే సాంకేతికంగా కాపీ రైట్స్‌, ఇంటెలెక్చువల్‌ రైట్స్‌, ట్రేడ్‌ లైసెన్స్‌, ఇతర విభాగాల కింద ఆ రెండు సంస్థల మధ్య ఓ వ్యాపార, వాణిజ్య అగ్రిమెంట్‌ ఉంటుంది. అది ఆర్థిక లావాదేవీలతో ముడిపడినదే. ఈ విషయం ఎంత మందికి తెలుసు? అంటే... బైజూస్‌ కంటెంట్‌ ఉన్న ప్రతి ట్యాబ్‌ విక్రయంపై ఆ సంస్థకు ‘కొంత’ లాభం ఉంటుందన్న మాట! బైజూస్‌ కంటెంట్‌ అద్భుతం, పేద పిల్లలకు బైజూస్‌ ట్యూషన్‌లు అనే తియ్యటి మాటల వెనుక దాగి ఉన్న అసలు విషయమిది! ప్రభుత్వం ఇప్పుడు మరింత దూకుడుగా 750 కోట్లతో 5 లక్షల ట్యాబ్‌లు కొంటోంది. ఈసారి కూడా బైజూస్‌ కంటెంట్‌ ఉన్న ట్యాబ్‌లే ఇస్తారని చెబుతున్నారు. అయితే, టెండర్‌ డాక్యుమెంట్‌లో, ప్రభుత్వ ఉత్తర్వుల్లో బైజూస్‌ ప్రస్తావన తీసుకురాలేదు. తెలివిగా, వ్యూహాత్మకంగా కొన్ని అంశా లు చేర్చారు. ‘‘తక్కువ ఖర్చుతో కొనే ట్యాబ్‌ల్లో ఉచితంగా లభించే సాప్ట్‌వేర్‌లను ఉపయోగించాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దీక్ష ప్లాట్‌ఫామ్‌తోపాటు ఇతర సోర్సులు ఉపయోగించుకోండి. సాఫ్ట్‌వేర్‌ను కొనడానికి ఎలాంటి బడ్జెట్‌ లేదు. టీచర్లు సులువుగా వినియోగించగల కంటెంట్‌ ఉండాలి’’ అని జీఓలో పేర్కొన్నారు. దీని అర్థం ఒకలా, పరమార్థం మరోలా ఉంది. ఉచితంగా దొరికే కంటెంట్‌... సీఎంకి ప్రీతిపాత్రమైన బైజూస్‌ ఒక్క టే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేరుగా బైజూస్‌ కం టెంట్‌ ఉన్న ట్యాబ్‌లు కొనుగోలు చేస్తామని చెప్పకుండా డొంక తిరుగుడు వివరణలు ఇచ్చుకుందన్న మాట!

వ్యక్తులతో పనేంటి?

రూ.750 కోట్లతో కొంటున్న ట్యాబ్‌ల కొనుగోలు టెం డర్‌ డాక్యుమెంట్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. బిడ్డింగ్‌లో ఎవరెవరు పాల్గొనవచ్చన్న దాంట్లో సొంతం గా ట్యాబ్‌లు తయారు చేసే కంపెనీలతోపాటు ఆసక్తి ఉన్న వ్యక్తులు కూడా పాల్గొన్నవచ్చని ప్రభుత్వం సెలవిచ్చింది. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా 5 లక్షల ట్యాబ్‌లు కొంటున్నప్పుడు... నేరుగా కంపెనీల నుంచే కొనొచ్చు. అలా కాకుండా... ‘థర్డ్‌ పర్సన్‌’ ఎందు కు వచ్చారు? కంపెనీ నుంచి ట్యాబ్‌లు కొని ప్రభుత్వానికి సరఫరా చేస్తే... ధర పెరగడం ఖాయం! ఇవన్నీ తెలిసీ... ‘వ్యక్తులు’ కూడా టెండరులో పాల్గొనవచ్చు అని చెప్పడం వెనుక పరమార్థం ఏమి టి? ఏదోఒక గోల్‌మాల్‌ చేసి... టెండరును అస్మదీయులకు దక్కేలా చేసేందుకేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఏళ్లనాటి స్పెసిఫికేషన్సే ఎందుకు?

ఈ రోజుల్లో రూ.7వేల స్మార్ట్‌ఫోన్‌ కూడా చార్జింగ్‌ కేబుల్‌ టైప్‌-సీ మోడ్‌లో ఉంటున్నాయి. ట్యాబ్‌లకూ అదే వాడుతున్నారు. ప్రపంచమంతా అదే విధానంలోకి వచ్చింది. కానీ.. జగన్‌ సర్కారు ఏడేళ్ల కిందటి మైక్రో యూఎ్‌సబీ కేబుల్‌తో చార్జింగ్‌ అయ్యే ట్యాబ్‌లే కావాలని సాంకేతిక ప్రమాణాలు నిర్ధేశించింది. దీని వల్ల ఆ టెక్నాలజీతో కూడిన ట్యాబ్‌లున్న కంపెనీలకు తప్ప మరెవ్వరికీ ఉపయోగం లేదన్నది నిపుణుల మాట. టైప్‌-సీ చార్జింగ్‌ పోర్టు ఉన్న ట్యాబ్‌లు కూడా సర్కారు నిర్దేశించిన ధరలోనే అవీ దొరుకుతున్నాయి. అయినా పాత విధానమే ఎందుకు ఎంపిక చేశారన్నది అతిపెద్ద ప్రశ్న! ట్యాబ్‌ ర్యామ్‌ 3జీబీ, అంతర్గత స్టోరేజీ 32 జీబీ ఉండాలన్న నిబంధనలు కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

గోప్యంగా జీవో

గత విద్యా సంవత్సరం(2022-23)లో బైజూస్‌ కంటెంట్‌ ట్యాబ్‌లు పొందిన విద్యార్థులు ఇప్పుడు 9వ తరగతికి అప్‌గ్రేడ్‌ అయ్యారు. కాబట్టి ఈ విద్యాసంవత్సరం (2023-24) కొత్తగా ఎనిమిదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులకు కొత్త ట్యాబ్‌లు కొనివ్వాలని జగన్‌ నిర్ణయించారు. అంతే... విద్యాశా ఖ పాత ఉత్తర్వుల (జీఓ-134) ఆధారంగానే ట్యాబ్‌లు కొనాలని నిర్ణయించింది. ఈ లెక్కన 2023-24 విద్యా సంవత్సరంలో 4,71,154 ట్యాబ్‌లు కొనాలి. కానీ, ఈసారి మరో పది శాతం అదనంగా 5 లక్షల ట్యాబ్‌లు కొనాలని విద్యాశాఖకు నిర్దేశించారు. ఈ మేరకు విద్యాశాఖ గత ఏడాది డిసెంబరులోనే జీఓ-18ను జారీ చేసింది. ఎనిమిదో తరగతి విద్యార్థుల కోసం 750 కోట్ల రూపాయలతో 5 లక్షల ట్యాబ్‌లు కొనేందుకు పరిపాలనా అనుమతి ఇచ్చిం ది. విద్యాశాఖ, ఏపీటీఎస్‌ కలిసి ఈ కొనుగోలును చేపట్టాలని, టెండర్లు ఏపీటీఎస్‌ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. 8 నెలలుగా ఈ జీవోను సర్కారు రహస్యంగా ఉంచింది. ఇప్పుడు టెండర్లు పిలవాలి కాబట్టి తప్పనిసరై బయటపెట్టింది.

Updated Date - 2023-08-23T11:36:02+05:30 IST