ఇకపై విద్యార్థులకు బడుల్లోనే బ్రేక్‌ఫాస్ట్! ఎప్పట్నుంచంటే..!

ABN , First Publish Date - 2023-05-15T12:09:08+05:30 IST

ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందిస్తామని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ

ఇకపై విద్యార్థులకు బడుల్లోనే బ్రేక్‌ఫాస్ట్! ఎప్పట్నుంచంటే..!
government schools

ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు: మంత్రి సత్యవతి

కృష్ణకాలనీ (భూపాలపల్లి), మే 14: ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందిస్తామని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొత్త సచివాలయంలో తన తొలి సంతకం అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా ఫైలుపై చేశానని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీకి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం పర్యటించిన మంత్రి.. భూపాలపల్లి మండలం కమలాపూర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతి గదిని ప్రారంభించారు. మత్స్యకారులకు ఫిషింగ్‌ కిట్లు, గౌడ కులస్థులకు తాటిచెట్లు ఎక్కే పరికరాలను పంపిణీ చేశారు. ఇక, భూపాలపల్లిలోని సుభాష్‌కాలనీలో సఖి కేంద్రాన్ని ప్రారంభించారు. మంజూర్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్‌ను, గణపురం మండలం చెల్పూరులో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రతి సర్కార్‌ బడిలోనూ ఉదయం పిల్లలకు అల్పాహారం అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు.

Updated Date - 2023-05-15T12:09:08+05:30 IST