హైదరాబాద్‌ నల్సార్‌ వర్సిటీలో ప్రవేశాలు.. సీట్లు ఎన్నంటే..!

ABN , First Publish Date - 2023-06-17T12:59:24+05:30 IST

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూల ద్వారా

హైదరాబాద్‌ నల్సార్‌ వర్సిటీలో ప్రవేశాలు.. సీట్లు ఎన్నంటే..!
Admissions

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. లా, సోషల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో మొత్తం 15 సీట్లు ఉన్నాయి.

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా/మేనేజ్‌మెంట్‌/హ్యుమానిటీస్‌ విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐసీఎ్‌సఐ నిర్వహించే కంపెనీ సెక్రటరీ ఎగ్జామినేషన్‌/ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఫైనల్‌ ఎగ్జామ్‌/ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఫైనల్‌ ఎగ్జామ్‌ ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. యూజీసీ నెట్‌/ సీఎ్‌సఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉన్నవారు ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ రాయనవసరం లేదు.

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌: ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. ఒక్కోదానికి 50 మార్కులు నిర్దేశించారు. మొదటి పార్ట్‌లో రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌, రైటింగ్‌ స్కిల్స్‌ సంబంధిత ప్రశ్నలు; రెండో పార్ట్‌లో స్పెషలైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. మొదటి పార్ట్‌కు గంటన్నర, రెండో పార్ట్‌కు రెండు గంటల పరీక్ష సమయం ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత పొందాలంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి. అభ్యర్థులందరూ 1500 నుంచి 2000 పదాలతో ప్రిలిమినరీ రీసెర్చ్‌ ప్రపోజల్‌ సబ్మిట్‌ చేయాలి.

ముఖ్య సమాచారం

ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 7

ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ తేదీ: జూలై 15

వెబ్‌సైట్‌: www.nalsar.ac.in

nalsar.gif

Updated Date - 2023-06-17T12:59:24+05:30 IST