Gurukula teachers special: ప్రిపరేషన్‌లో కరెంట్ అఫైర్స్‌కు ఇలా ప్రాధాన్యత ఇస్తే..!
ABN , First Publish Date - 2023-06-05T12:25:29+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రతి పోటీ పరీక్షకు జనరల్ స్టడీస్ తప్పనిసరి. జనరల్ స్టడీస్ అనే విశాలమైన
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రతి పోటీ పరీక్షకు జనరల్ స్టడీస్ తప్పనిసరి. జనరల్ స్టడీస్ అనే విశాలమైన బండికి, ఇరుసు లాంటిది కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి తమ ప్రిపరేషన్‌లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
వాస్తవానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబ్‌సలో ఎనభై శాతం స్ట్టాటిక్ లేదా స్థిరమైన అంశాలపై సిలబస్ రూపొంది ఉంటుంది. మిగతా ఇరవై శాతం సిలబస్ డైనమిక్ లేదా మారుతున్న నూతన అంశాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌లో డైనమిక్ అంశాలను స్థిర అంశాలకు జోడిస్తూ సంసిద్ధం కావాలి. తొలిసారిగా పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌పై స్పష్టత ఉండదు. పరీక్షలో అడిగే కొన్ని ప్రశ్నలు తమ జీవితకాలంలో ఎన్నడూ వినని, చదవని అంశాలుగా ఉంటాయి. అయితే ఒక క్రమపద్ధతి ప్రకారం నిత్య నూతన అంశాలను అధ్యయనం చేయడం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు.
సిలబస్‌లో ఏముంది?
వాస్తవానికి జనరల్ స్టడీస్ సిలబ్‌సలో పేర్కొనే కంటెంట్ వివరణాత్మకంగా ఉండదు. భావన మాత్రమే ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ సిలబ్‌సను కింది విధంగా విభజించుకోవాలి.
స్థానిక అంశాలు
జాతీయ అంశాలు
అంతర్జాతీయ అంశాలు
అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌ను స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు అధ్యయనం చేయాలి. ఈ అంశాలు సిలబ ్‌సలో వివరణాత్మకంగా ఉండవు. గత ప్రశ్న పత్రాల ఆధారంగా సిలబ్‌సను అభ్యర్థులే రూపొందించుకోవాలి. స్పష్టత కోసం గత ప్రశ్న పత్రాల సరళిని గమనించాలి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే, ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం గురుకుల్ బోర్డు నిర్వహిస్తున్న పరీక్షల సిలబ ్‌సకు దిక్సూచిలా ఉపయోగపడుతుంది. అభ్యర్థులు ఇటీవలి కాలంలో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్ష పేపర్‌ను విశ్లేషించుకోవడం ద్వారా సిలబ్‌సపై అవగాహన పెంచుకోవచ్చు.
గతంలో టీఎ్‌సపీఎస్సీ, ఎపీపీఎస్సీ నిర్వహించిన జనరల్ స్టడీస్ పేపర్లలో భాగమైన కరెంట్ అఫైర్స్‌లోని అంశాల ఆధారంగా సిలబ్‌సలో ఈ కింది విషయాలు ఉంటాయని గుర్తించాలి. ప్రస్తుత గురుకుల్ బోర్డు సైతం ఈ అంశాలపైనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
అంతర్జాతీయ పరిణామాలు - సంబంధాలు
జాతీయ, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు
రాజ్యాంగ పరమైన సమకాలీన అంశాలు, పరిపాలన సంస్కరణలు
పర్యావరణం- జీవ వైవిధ్యం - విపత్తు నిర్వహణ అంశాలు
ఆర్థిక అంశాలు
సైన్స్, టెక్నాలజీ రంగాల్లో నవీన మార్పులు
కమిటీలు నివేదికలు
వ్యక్తులు సమకాలీన ప్రాధాన్యతలు
అవార్డులు - రివార్డులు
సదస్సులు - సమావేశాలు
వివిధ ముఖ్య దినోత్సవాలు
క్రీడా విశేషాలు
నియామకాలు
స్థానిక అంశాలు
ఇటీవలి కాలంలో ప్రకటించిన ప్రభుత్వ పథకాలు
పై అంశాలపై యూపీఎస్సీ స్థాయిలో జాతీయంగా, పబ్లిక్ సర్వీస్ స్థాయిలో రాష్ట్రీయంగా ప్రశ్నలు వచ్చాయి. అభ్యర్థులు పై అంశాల ఆధారంగా తమ ప్రిపరేషన్‌ను మెరుగుపర్చుకోవాలి. కాబట్టి ప్రశ్నల భూమిక లేదా మూలాంశాలపై అవగాహన పెంచుకోవాలి. దీని కోసం ఈ కింది అంశాలను అవగతం చేసుకోవాలి.
జనరల్ నాలెడ్జ్ పునాదిగా కరెంట్ అఫైర్స్
నిజానికి కరెంట్ అఫైర్స్‌పై సంసిద్ధం అవుతున్న అభ్యర్థులకు స్టాక్ జికె పునాదిగా ఉండాలి. స్థిరమైన సాధారణ పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను అభ్యర్థులు నిత్యం నోట్స్ రూపంలో రాసుకోవాలి. బేసిక్ జికె కోసం హైస్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు సామాజిక శాస్త్రాలు, జనరల్ సైన్స్ సబ్జెక్ట్స్‌లను అధ్యయనం చేయాలి. బిట్స్ వంటి ప్రశ్నలు కాకుండా నిర్మాణాత్మకంగా సమగ్రంగా అధ్యయనం సాగించాలి.
సామాజిక శాస్త్రాలు
ప్రతి పోటీ పరీక్షల జనరల్ స్టడీ్‌సకు సామాజిక శాస్త్రాలే పునాది. ఈ పరీక్షల ద్వారా ఉద్యోగం పొందే అభ్యర్థులు సమాజంలోనే పనిచేయాలి. కాబట్టి, సామాజిక శాస్త్రాలపై వివరణాత్మక అధ్యయనం అవసరం. ప్రధానంగా ఎకానమీ, భారత రాజకీయ వ్యవస్థలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, సమాచారాన్ని స్టాక్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌కి అనుసంధానం చేసుకోవాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
సైన్స్, టెక్నాలజీ రంగాల్లో నిత్యం మార్పులు సంభవిస్తుంటాయి. స్పేస్, న్యూక్లియర్, పర్యావరణం, మెడిసిన్, లైఫ్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సబ్జెక్ట్‌లలో వచ్చే మార్పులపై అభ్యర్థులకు స్పష్టమైన పరిశీలన, ఆసక్తి ఉండాలి.
అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ పునాదులను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా నోట్స్ రాసుకోవాలి. నిరంతరం స్టాటిక్ నాలెడ్జ్‌కి, డైనమిక్ నాలెడ్జ్‌ని అనుసంధానం చేసుకోగలగాలి.
కరెంట్ అఫైర్స్ కోసం ఏమి చదవాలి?
అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ నిత్య జీవితంలో భాగంగా మార్పు కావాలి. దీని కోసం..
దిన పత్రికలు ఫ మాస పత్రికలు
ఇయర్ బుక్స్
టెలివిజన్‌లో అకడమిక్ చర్చలను నిత్యం అనుసరించాలి. ఇటీవలి కాలంలో దిన పత్రికలు ప్రధానంగా తెలుగు దినపత్రికలు కరెంట్ అఫైర్స్‌పై రెగ్యులర్‌గా సమాచారం అందజేస్తున్నాయి. బహుశా భారతదేశంలోని ఏ ఇతర భాషల్లోనూ ఇంత వివరణతో కూడిన కాంపిటేటివ్ సమాచారం ఇవ్వడం లేదు.
కరెంట్ అఫైర్స్‌ను స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు అధ్యయనం చేయాలి. ఈ అంశాలు సిలబ్‌సలో వివరణాత్మకంగా ఉండవు. గత ప్రశ్న పత్రాల ఆధారంగా సిలబ్‌సను అభ్యర్థులే రూపొందించుకోవాలి. స్పష్టత కోసం గత ప్రశ్న పత్రాల సరళిని గమనించాలి.
మాదిరి ప్రశ్నలు
1. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన నాణెంలో ఉపయోగించిన లోహం?
ఎ) వెండి బి) రాగి సి) నికెల్ డి) పైవన్నీ
2. ఇటీవలి కాలంలో విడుదలైన ‘ముళ్ల చినుకులు’...?
ఎ) దళిత కథల సంకలనం
బి) స్త్రీ జీవన అంశాల కవితా సంకలనం
సి) రాయలసీమ కథల సంకలనం
డి) తెలంగాణ అంశాల కవితా సంకలనం
3. నాసా కొత్తగా ఏర్పాటు చేసిన ‘మూన్ టు మార్స్’ ప్రాజెక్టుకు తొలి చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) వినయ్‌నీల్ వర్మ బి) అమిత్ క్షత్రీయ
సి) సంజయ్ బర్మన్ డి) ఆదిత్య బార్
4. ఇటీవలి కాలంలో ఈ-స్కూటర్స్‌ని నిషేధించిన నగరం?
ఎ) లండన్ బి) పారిస్ సి) సింగపూర్ డి) ఢిల్లీ
5. తెలంగాణలో నిర్మిస్తున్న ఏ ప్రాజెక్టును నిలిపివేయా లని ‘జాతీయ హరిత ట్రిబ్యునల్’ ఆదేశించింది?
ఎ) శారద సాగర్ ప్రాజెక్ట్
బి) సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్
సి) నవగంగా ప్రాజెక్ట్ డి) డిండి ప్రాజెక్ట్
సమాధానాలు: 1)డి 2)ఎ 3)బి 4)బి 5)బి
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్ డైరెక్టర్,
5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్