Telangana గిరిజన గురుకులాల్లో Inter ప్రవేశాలు
ABN , First Publish Date - 2023-01-30T16:26:56+05:30 IST
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Tribal Welfare Gurukula Vidyalayas) (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Center of Excellence) (సీఓఈ) కాలేజీల్లో జూనియర్ ఇంటర్
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Tribal Welfare Gurukula Vidyalayas) (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Center of Excellence) (సీఓఈ) కాలేజీల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాల (Inter admissions)కు నోటిఫికేషన్ వెలువడింది. సంస్థ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీటీడబ్ల్యూఆర్ సీఓఈ సెట్) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు కూడా ఈ టెస్ట్ రాయవచ్చు. ఎంపీసీ (mpc), బైపీసీ గ్రూప్‌లు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్ పొందినవారికి అకడమిక్ బోధనతోపాటు ఐఐటీ (IIT), నీట్ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం (English medium)లో చదవాల్సి ఉంటుంది. బాలురకు, బాలికలకు విడివిడిగా కళాశాలలు ఉన్నాయి. భోజనం, వసతి ఉచితం.
సీట్ల వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సీఓఈ కళాశాలల్లో మొత్తం 1140 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ గ్రూప్‌లో బాలురకు 335, బాలికలకు 240 సీట్లు; బైపీసీ గ్రూప్‌లో బాలురకు 325, బాలికలకు 240 సీట్లు ఉన్నాయి. ప్రతి గిరిజన గురుకుల సీఓఈ కళాశాలలో ఒక్కో గ్రూప్‌లో కనీసం 40 సీట్లు ఉన్నాయి.
విద్యార్థులు దరఖాస్తులో తాము చేరదలచుకొన్న సీఓఈ కళాశాలల ప్రాధాన్య క్రమాన్ని సూచించాలి.
బాలుర సీఓఈ కళాశాలలు: రంగారెడ్డి - రాజేంద్రనగర్ ఐఐటీ స్టడీ సెంటర్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మెదక్, సిద్దిపేట్, భద్రాద్రి కొత్తగూడెం, దమ్మపేట గిరిజన గురుకులాలు
బాలికల సీఓఈ కళాశాలలు: వరంగల్, వికారాబాద్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం గిరిజన గురుకులాలు
అర్హత: ప్రస్తుతం పదోతరగతి పరీక్షలకు సన్నద్దమౌతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఎ్‌సఈ, సీబీఎ్‌సఈ విద్యార్థులు కూడా అర్హులే. అభ్యర్థుల వయసు ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లలోపు ఉండాలి. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000; నగరాల్లో రూ.2,00,000 మించకూడదు.
ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు: పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ఇందులో మొత్తం 160 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఎంపీసీ అభ్యర్థులకు ఇంగ్లీష్ నుంచి 20, మేథ్స్ నుంచి 60, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. బైపీసీ అభ్యర్థులకు ఇంగ్లీష్ నుంచి 20, మేథ్స్ నుంచి 20, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, బయోసైన్స్ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఎనిమిదో తరగతి నుంచి పదోతరగతి వరకు ఉన్న సిలబస్ ప్రకారం ఉంటాయి. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 160. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే పావు మార్కు కోత విధిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: 100
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 17
హాల్ టికెట్స్ డౌన్‌లోడింగ్: ఫిబ్రవరి 27 నుంచి
టీటీడబ్ల్యూఆర్ సీఓఈ సెట్ 2023 తేదీ: మార్చి 12
వెబ్‌సైట్: www.tgtwgurukulam. telangana.gov.in