Hyderabad Nims: హైదరాబాద్ నిమ్స్‌లో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రవేశాలు
ABN , First Publish Date - 2023-10-11T12:34:44+05:30 IST
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(నిమ్స్)- మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది.
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(నిమ్స్)- మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఈ ప్రోగ్రామ్‌లో మస్క్యులోస్కెలెటల్ సైన్సెస్, కార్డియోవాస్క్యులర్ అండ్ పల్మనరీ సైన్సెస్, న్యూరో సైన్సెస్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఒక్కోదానిలో అయిదు చొప్పున మొత్తం 15 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్, కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ(బీపీటీ) ఉత్తీర్ణులై ఉండాలి. 2023 సెప్టెంబరు 30 నాటికి ఆరు నెలల ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఏ ఇతర కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండకూడదు. అభ్యర్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిమ్స్ ఉద్యోగులకు వయోపరిమితి నిబంధనలు వర్తించవు.
ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థి ఎంచుకొన్న స్పెషలైజేషన్‌కు సంబంధించి బేసిక్ అండ్ క్లినికల్ సైన్సెస్, బయోమెకానిక్స్, ఫిజియోథెరపీ టెక్నిక్స్, క్రిటికల్ కేర్, రీహాబిలిటేషన్ అంశాల నుంచి 30 ప్రశ్నలు; జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్, గైనకాలజీ, ఎలకో్ట్రథెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఫస్ట్ ఎయిడ్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, రేడియాలజీ, సోషియాలజీ, సైకాలజీ వంటి జనరల్ క్లినికల్ సైన్సెస్ అంశాలనుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ బీపీటీ సిలబస్ ప్రకారం ఉంటాయి. సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 60. పరీక్ష సమయం గంట. ఈ టెస్ట్‌లో అర్హత సాధించాలంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తారు.
ముఖ్య సమాచారం
రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు: రూ.5,000
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 13
దరఖాస్తు హార్డ్ కాపీ చేరేందుకు చివరి తేదీ: అక్టోబరు 18
చిరునామా: అసోసియేట్ డీన్, అకడమిక్ - 2, రెండో అంతస్తు, పాత ఓపీడీ బ్లాక్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్ - 500082
వెబ్సైట్: www.nims.edu.in