Home » NIMS
లాలూ యాదవ్‌కు గత రెండ్రోజులుగా ఆరోగ్యం బాగోలేదు. బుధవారం ఉదయం పరిస్థితి మరింత దిగజారడం కుటుంబసభ్యులు, మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చాలాకాలంగా ఆయన వైద్యచికిత్సలు తీసుకుంటుండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా 33 ఏళ్ల రోగికి కొత్త జీవితం ప్రసాదించారు. ఈ చికిత్సను ‘ఆరోగ్యశ్రీ పథకం’ కింద ఉచితంగా నిర్వహించడం విశేషం.
రాష్ట్రంలో పట్టుమని పాతికేళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రక్తపోటు, మధుమేహం బారిన పడ్డవారు కిడ్నీలు దెబ్బతిని 50-60 ఏళ్ల వయసులో ఆస్పత్రులకు వెళ్లేవారు.
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నుంచి వ్యక్తిగత కారణాలతోనే వైద్యులు వెళ్లిపోతున్నారని ఆ సంస్థ డైరెక్టర్ డా.ఎన్.బీరప్ప తెలిపారు. ‘నిమ్స్‌కు వైద్యుల టాటా’ పేరిట గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో పేదోడి వైద్యానికి పెద్ద భరోసాగా నిలిచే నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైదొలుగుతున్నారు.
రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చక్రాల కుర్చీకే పరిమితమైన వ్యక్తికి నిమ్స్ వైద్యులు అరుదైన ‘స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్’ శస్త్రచికిత్స నిర్వహించారు.
క్యాన్సర్‌తో బాధపడుతు న్న పిల్లలకు మెరుగైన చికిత్స అందించడానికి నిమ్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పా టు చేయబోతున్నామని ఆ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి తెలిపారు.
నిమ్స్‌లో ఓపీ స్లిప్‌ల కోసం గంటల తరబడి నిరీక్షించే పరిస్థితికి త్వరలోనే చెక్ పడనుంది. ఇందుకోసం నిమ్స్ మిలీనియం బ్లాక్ వద్ద ప్రయోగత్మకంగా ఒక కియోస్క్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.
ఏడేళ్లుగా కంటినిండా నిద్రపోలేని బాలుడికి శస్త్రచికిత్స చేసిన నిమ్స్ వైద్యులు(NIMS doctors) ఇకపై ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం కల్పించారు. శ్వాస కూడా సరిగా తీసుకోలేని బాలుడు భవిష్యత్తులో హాయిగా ఆడుకునే భాగ్యం కల్పించారు.
Manda Jagannadham: నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం తుది శ్వాస విడిచారు.