Vijayawada: ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో పీజీ.. ఎన్ని సీట్లు ఉన్నాయంటే..!
ABN , First Publish Date - 2023-03-13T15:56:28+05:30 IST
విజయవాడ (Vijayawada) లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (School of Planning and Architecture) (ఎస్‌పీఏవీ)-పీజీ ప్రోగ్రామ్‌లలో డైరెక్ట్ అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ విడుదల
విజయవాడ (Vijayawada) లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (School of Planning and Architecture) (ఎస్‌పీఏవీ)-పీజీ ప్రోగ్రామ్‌లలో డైరెక్ట్ అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఆర్కిటెక్చర్, ప్లానింగ్ విభాగాల్లో మొత్తం 12 సీట్లు ఉన్నాయి.
ఆర్కిటెక్చర్
ఈ విభాగంలో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ అర్బన్ డిజైన్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్‌లో సస్టయినబుల్ ఆర్కిటెక్చర్, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి.
అర్హత: మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ అర్బన్ డిజైన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ పూర్తిచేసి ఉండాలి. మాస్టర్ ఆఫ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌కు(బీఈ/బీటెక్)(సివిల్ ఇంజనీరింగ్/ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ/ కన్‌స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్/ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
ప్లానింగ్
ఈ విభాగంలో మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇందులో ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ(ప్లానింగ్/ ఆర్కిటెక్చర్) లేదా (బీఈ/ బీటెక్)(సివిల్ ఇంజనీరింగ్/ ప్లానింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ(జాగ్రఫీ/ ఎకనామిక్స్/సోషియాలజీ) పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
అడ్మిషన్ ప్రక్రియ
అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సంస్థ నిర్ణయం మేరకు ఇందులో అర్హత పొందినవారికి సంబంధించి స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ పరిశీలన, పోర్ట్‌ఫోలియో అసె్‌సమెం ట్, ఇంటర్వ్యూలు నిర్వహించి అడ్మిషన్స్ ఇస్తారు.
వెయిటేజీ: స్టేట్‌మెంట్ ఆఫ్ పర్ప్‌సకు 10 మార్కులు, పోర్ట్‌ఫోలియోకు 10 మార్కులు, ఇంటర్వ్యూకి 60 మార్కుల వెయిటేజీ ఉంటుంది.
ముఖ్య సమాచారం
డిగ్రీ స్థాయిలో ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 10
ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూలు: ఏప్రిల్ 27, 28
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: మే 8
అడ్మిషన్స్ ప్రక్రియకు ముగింపు తేదీ: మే 18
చిరునామా: రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సర్వే నెం. 4/4, ఐటీఐ రోడ్, విజయవాడ - 520008
వెబ్‌సైట్: www.spav.ac.in