TS SET: టీఎస్ సెట్ నోటిఫికేషన్ విడుదల.. ఏ పోస్టుల కోసమంటే..!
ABN , First Publish Date - 2023-08-01T17:11:14+05:30 IST
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2023 నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. పరీక్షను అక్టోబరులో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల పోస్టుకు అర్హత సాధించేందుకు
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2023 నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. పరీక్షను అక్టోబరులో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల పోస్టుకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ సెట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష జనరల్ స్టడీస్, 20 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో ఉంటుంది.
సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్(పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్‌సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మేథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్‌ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత టెస్ట్(సీబీటీ) పద్ధతిలో జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 5
పరీక్ష నిర్వహణ: 2023 అక్టోబరులో
వెబ్‌సైట్: www.telanganaset.org/