TS Medical: 48 వేలకు పైగా జీతంతో హైదరాబాద్‌లో పోస్టులు

ABN , First Publish Date - 2023-03-21T14:54:25+05:30 IST

హైదరాబాద్‌లోని జాయింట్‌ డైరెక్టర్‌ (మెడికల్‌), ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌(ఐఎంఎస్‌)లో ఒప్పంద ప్రాతిపదికన

TS Medical: 48 వేలకు పైగా జీతంతో హైదరాబాద్‌లో పోస్టులు
హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని జాయింట్‌ డైరెక్టర్‌ (మెడికల్‌), ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌(ఐఎంఎస్‌)లో ఒప్పంద ప్రాతిపదికన ఈఎస్‌ఐ ఆసుపత్రులు/ డిస్పెన్సరీలు/ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టులు: 1) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: 59 2) డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: 1

3) ల్యాబ్‌ టెక్నీషియన్‌: 11, 4) ఫార్మసిస్ట్‌: 43. మొత్తం: 114

అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ల్యాబరేటరీ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు సీఏఎస్‌, డీఏఎస్‌ పోస్టులకు రూ.48,850; ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌లకు రూ.31,040.

వయసు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా అందించాలి.

చిరునామా: జాయింట్‌ డైరెక్టర్‌(మెడికల్‌), ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌, హైదరాబాద్‌, అయిదో అంతస్తు, హాస్టల్‌ బిల్డింగ్‌, ఈఎస్‌ఐ హాస్పిటల్‌, సనత్‌నగర్‌, నాచారం, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 28

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/

ts.jpg

Updated Date - 2023-03-21T14:56:41+05:30 IST