Jobs: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌లు.. ఖాళీలెన్నంటే..!
ABN , First Publish Date - 2023-07-18T17:05:27+05:30 IST
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(వైజాగ్ స్టీల్)...వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(వైజాగ్ స్టీల్)...వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినీ: 200 ఖాళీలు
2. టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినీ: 50 ఖాళీలు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, సిరామిక్స్, మైనింగ్, కెమికల్.
స్టయిపెండ్: నెలకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు రూ.9000; డిప్లొమా ఇంజనీరింగ్ అభ్యర్థులకు రూ.8000
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం
అర్హత: 2021/2022/2023 విద్యా సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31
వెబ్‌సైట్: https://www.vizagsteel.com/index.asp