Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో టీచింగ్ పోస్టులు

ABN , First Publish Date - 2023-10-10T11:54:17+05:30 IST

ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో టీచింగ్ పోస్టులు

ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రొఫెసర్‌

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎ్‌స/డీఎన్‌బీ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధనానుభవం ఉండాలి.

వయోపరిమితి: 69 ఏళ్లు మించకూడదు

వేతనం: ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకు అదనంగా మరో రూ.50 వేలు ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ: పీజీ మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి మెయిల్‌ ద్వారా పంపాలి.

dmerecruitment.contract@ gmail.com

ముఖ్యమైన తేదీలు:

ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్‌ ద్వారా అక్టోబరు 15లోగా దరఖాస్తు చేసుకోవాలి.

అర్హులకు అక్టోబరు 20న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

ఎంపికైన అభ్యర్థులు నవంబరు 1లోగా జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాలి.

వెబ్‌సైట్‌: dme.telangana.gov.in/

Updated Date - 2023-10-10T11:54:17+05:30 IST