తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒంటి పూట బడులు ఎప్పట్నుంచంటే..!
ABN , First Publish Date - 2023-02-18T12:05:32+05:30 IST
పదవ తరగతి పరీక్షలు (10th Class Exams) ఏప్రిల్ 3 నుంచి 12 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని
ఏప్రిల్ 23 నుంచి సెలవులు
హైదరాబాద్, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రం (Telangana) లోని పాఠశాలలకు ఒక పూట బడి (Half day school) విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ (Education Department) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్రమేపి ఎండల తీవ్రత (Summer) పెరుగుతుండడంతో విద్యార్థులకు (Students) ఇబ్బంది లేకుండా ఉండేంందుకు ఒంటిపూట బడులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 23 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ సూచించింది. అలాగే రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు (10th Class Exams) ఏప్రిల్ 3 నుంచి 12 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో వారికి ఏప్రిల్ 17తో పరీక్షలు ముగియనున్నాయి.
ఇది కూడా చదవండి: Viral Video: బైక్‌పై ఈ కోతులు ఎంత బుద్ధిగా కూర్చున్నాయో.. డ్రైవింగ్ చేసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!