Telangana gurukulam: తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
ABN , First Publish Date - 2023-06-03T18:19:54+05:30 IST
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యుఆర్‌ఈఐఎ్‌స)-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 జనరల్ గురుకులాల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యుఆర్‌ఈఐఎ్‌స)-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 జనరల్ గురుకులాల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లతోపాటు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. ప్రతి కళాశాలలో ఒక్కో గ్రూప్‌లో 40 సీట్లు; ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ఒక్కోదానిలో 20/30 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు తాము ఎంచుకున్న గ్రూప్, గురుకుల కళాశాల వివరాలను దరఖాస్తులో సూచించాలి. పదోతరగతిలో సాధించిన మెరిట్ ప్రకారం సంబంధిత జిల్లా గురుకులాల్లో అడ్మిషన్స్ ఇస్తారు. బోధన, వసతి ఉచితం. యూనిఫాం, అకడమిక్ బుక్స్ ఇస్తారు. వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించనవసరం లేదు. విద్యార్థులకు అవసరమైన మెడికల్ కేర్ అందిస్తారు. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో అడ్మిషన్ పొందినవారికి అకడమిక్ బోధనతోపాటు ఐఐటీ, నీట్ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
అర్హత: ఎస్‌ఎ్‌ససీ/ఐసీఎ్‌సఈ/సీబీఎ్‌సఈ నుంచి 2023 మార్చిలో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్థులు కూడా అర్హులే. అభ్యర్థుల వయసు ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లలోపు ఉండాలి. ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులు, క్రీడాకారులు, అనాథలకు నిబంధనల ప్రకారం అడ్మిషన్స్ ఇస్తారు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000; నగరాల్లో రూ.2,00,000 మించకూడదు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 15
వెబ్‌సైట్: www.tgtwgurukulam.telangana.gov.in