Notification: జ్యోతిబాపూలే గురుకులాల్లో బ్యాక్‌లాగ్ ఎంట్రెన్స్ టెస్ట్
ABN , First Publish Date - 2023-03-11T18:02:15+05:30 IST
హైదరాబాద్ (Hyderabad) లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యుఆర్‌ఎస్) - రాష్ట్రవ్యాప్తం (Telangana)గా ఉన్న గురుకులాల్లో మిగిలిన సీట్ల
హైదరాబాద్ (Hyderabad) లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యుఆర్‌ఎస్) - రాష్ట్రవ్యాప్తం (Telangana)గా ఉన్న గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బ్యాక్‌లాగ్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా బీసీ బాల బాలికల పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని పాత జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. స్టేట్ సిలబస్‌ను అనుసరిస్తారు. యోగా, వ్యాయామం, క్రీడలు, ఆటపాటలకు ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు ఉంటాయి. విద్య, భోజనం, వసతి ఉచితం. రాష్ట్ర వ్యాప్తంగా 148 బాలుర గురుకులాలు, 146 బాలికల గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి.
అర్హత వివరాలు: ఆరోతరగతిలో ప్రవేశానికి అయిదో తరగతి, ఏడోతరగతిలో ప్రవేశానికి ఆరోతరగతి, ఎనిమిదో తరగతిలో ప్రవేశానికి ఏడోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ/ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలి. విద్యార్థుల వయసు ఆగస్టు 31 నాటికి ఆరోతరగతికి 12 ఏళ్లు, ఏడోతరగతికి 13 ఏళ్లు, ఎనిమిదోతరగతికి 14 ఏళ్లు మించకూడదు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ విద్యార్థులకు రూ.1,50,000; పట్టణ ప్రాంతాల విద్యార్థులకు రూ.2,00,000 మించకూడదు.
ఎంట్రెన్స్ టెస్ట్: దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. తెలుగులో 15, లెక్కల్లో 30, సామాన్యశాస్త్రంలో 15, సాంఘిక శాస్త్రంలో 15, ఇంగ్లీ్‌షలో 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రవేశం పొందే తరగతిని అనుసరించి ముందు తరగతి సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
దరఖాస్తు నిబంధనలు: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి వివరాలు పూర్తిగా నింపాలి. విద్యార్థి ఫొటో; పుట్టిన తేదీ, కులం, ఆదాయం, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ పత్రాలు; బోనఫయిడ్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయాలి. సొంత జిల్లాకు చెందిన పరీక్ష కేంద్రాలను మాత్రమే ఎంచుకోవాలి. సంస్థ వెబ్‌సైట్‌లో ఇచ్చిన పాఠశాలల పట్టికను పరిశీలించి పాఠశాల ప్రాధాన్యక్రమాన్ని సూచించాలి. దరఖాస్తును అప్‌లోడ్ చేసిన తరవాత మార్పులకు వీలు లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. విద్యార్థులకు సొంత జిల్లా పాఠశాలల్లో మాత్రమే ప్రవేశం లభిస్తుంది. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీలు ఉండవు. పూర్తి వివరాలకోసం విద్యార్థులు దగ్గరలోని సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని సంప్రదించవచ్చు.
మిగిలిన సీట్ల వివరాలు
ఆరోతరగతిలో
మొత్తం సీట్లు 1976. బాలురకు 926, బాలికలకు 1050 సీట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్‌లో 138, రంగారెడ్డిలో 290, హైదరాబాద్‌లో 68, మెదక్‌లో 309, నిజామాబాద్‌లో 203, ఆదిలాబాద్‌లో 164, కరీంనగర్‌లో 223, వరంగల్‌లో 149, ఖమ్మంలో 375, నల్లగొండలో 57 సీట్లు ఉన్నాయి.
ఏడోతరగతిలో
మొత్తం సీట్లు 1567. బాలురకు 584, బాలికలకు 983 సీట్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 109, రంగారెడ్డిలో 159, హైదరాబాద్‌లో 51, మెదక్‌లో 229, నిజామాబాద్‌లో 148, ఆదిలాబాద్‌లో 140, కరీంనగర్‌లో 184, వరంగల్‌లో 125, ఖమ్మంలో 383, నల్లగొండలో 39 సీట్లు ఉన్నాయి.
ఎనిమిదోతరగతిలో
మొత్తం సీట్లు 1632. బాలురకు 712, బాలికలకు 920 సీట్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 135, రంగారెడ్డిలో 129, హైదరాబాద్‌లో 67, మెదక్‌లో 226, నిజామాబాద్‌లో 159, ఆదిలాబాద్‌లో 168, కరీంనగర్‌లో 199, వరంగల్‌లో 154, ఖమ్మంలో 320, నల్లగొండలో 75 సీట్లు ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 20
హాల్‌టికెట్స్ డౌన్‌లోడింగ్: మే 2 నుంచి
బ్యాక్‌లాగ్ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: మే 10న
అడ్మిషన్ ప్రక్రియ ముగింపు తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: mjptbcwreis.telangana.gov.in