Telangana: ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-03-10T11:43:07+05:30 IST

రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ సబ్జెక్టులను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం 10 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను గుర్తించారు. ముందుకు వచ్చే ప్రైవేటు కాలేజీల్లోనూ

Telangana: ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం
కీలక నిర్ణయం

సాధారణ డిగ్రీలో ఇంజనీరింగ్‌ కోర్సులు

ఉన్నత విద్యా మండలి భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): సాధారణ డిగ్రీ (Degree)లో ఇంజనీరింగ్‌ కోర్సులను (Engineering courses) ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ సబ్జెక్టులను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం 10 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను గుర్తించారు. ముందుకు వచ్చే ప్రైవేటు కాలేజీల్లోనూ కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. రాష్ట్రం (Telangana)లో ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపరిచే అంశంపై చర్చించేందుకు గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సాంకేతిక విద్యా శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌.. వివిధ వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. ఈ మేరకు డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి వచ్చే కోర్సులను విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొదట గుర్తించిన ప్రభుత్వ 10 కాలేజీల్లో ఈ సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆయా కాలేజీల్లో ప్రమాణాలను పెంచడానికి వీలుగా న్యాక్‌ గుర్తింపును పొందేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. న్యాక్‌ గుర్తింపు పొందడానికి ఆయా కాలేజీలు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. న్యాక్‌ గుర్తింపు తెచ్చుకున్న కాలేజీలకు ప్రోత్సాహకంగా రూ.లక్ష ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అలాగే, కాలేజీల గుర్తింపు ప్రక్రియను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2023-03-10T11:43:07+05:30 IST