SSC Hall tickets: టెన్త్ హాల్ టికెట్లు విడుదల
ABN , First Publish Date - 2023-03-24T17:40:22+05:30 IST
తెలంగాణ (Telangana)లో ఏప్రిల్ 3 నుంచి జరగబోయే పదో తరగతి (Tenth Exam) వార్షిక పరీక్షల హాల్‌టికెట్ల (Hall tickets)ను ఎస్‌ఎస్‌సీ(SSC) బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు హాల్‌టికెట్లను https://bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ఏప్రిల్ 3 నుంచి జరగబోయే పదో తరగతి (Tenth Exam) వార్షిక పరీక్షల హాల్‌టికెట్ల (Hall tickets)ను ఎస్‌ఎస్‌సీ(SSC) బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు హాల్‌టికెట్లను https://bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ రమేశ్ తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తారీఖు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థుల కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెబ్‌సైట్‌లో జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లను స్కూల్ నుంచి తీసుకోవచ్చని లేదా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడించారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకున్నా పరీక్షకు అనుమతిస్తామన్నారు. ఇక తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పరిధిలో చదువుకుంటున్న టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మే 4న ఇవి పూర్తవుతాయి.