Health Tips: శరీరంలో రక్తం కలుషితమైతే జరిగేదేంటి? దీన్ని పరిష్కరించడానికి ఏం చెయ్యాలంటే..
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:15 PM
శరీరంలో రక్తం కలుషితమైతే రోగాల సమస్య పెరుగుతుంది. దీన్ని శుద్ది చేసుకోవాలంటే ఈ ఆహారాలు బెస్ట్.
మనిషి శరీరంలో సుమారు 5 లీటర్లకు పైగా రక్తముంటుంది. మానవ శరీరంలో రక్తం కలుషితమైనా, రక్తం తక్కువగా ఉన్నా అనేక వ్యాధులు సంభవిస్తాయి. కలుషితమైన ఆహారం, నీరు, కృత్రిమ పానీయాలు, వాతావరణ కాలుష్యం, చెడు అలవాట్ల కారణంగా రక్తం కలుషితమవుతుంది. దీని కారణంగా శరీరంలో రక్తం నిర్వహించాల్సిన పనులు సజావుగా జరగవు. ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి. పోషకాలను చేరవేయడం కష్టమవుతుంది. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. జబ్బులు తొందరగా తగ్గవు. అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఇంట్లోనే ఈ ఆహారాలుతింటూ కలుషితమైన రక్తాన్ని శుద్ది చేసుకోవచ్చు(Blood purified foods).
బీట్ రూట్..(Beet root)
బీట్‌రూట్‌లో బీటాసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. బీట్రూట్ ముక్కలను రెండు గ్లాసుల నీటిలో వేసి 7-10 నిమిషాలు ఉడికించాలి. అందులో ఎండుమిర్చి, జీలకర్ర పొడి కలపాలి. దీని తరువాత, దానిని ఫిల్టర్ చేసి త్రాగాలి. దీన్ని రెండు మూడు వారాలు తాగితే ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Health Tips: చలికాలంలో జరిగే బిగ్ మిస్టేక్ ఇదే.. ఇష్టంగా తినే ఈ 6 ఆహారాల వల్ల ఏం జరుగుతుందంటే..!
అల్లం, నిమ్మకాయ..(ginger, lemon)
అల్లాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, నల్లమిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తం శుద్ది అవుతుంది.
తులసి..(Basil)
తులసి ఆకులు గొప్ప ఔషదంగా పరిగణింపబడతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తింటే రక్తం శుద్ది అవుతుంది. రక్తంలో ఆక్సిజన్ పరిమాణం కుడా పెరుగుతుంది.
వేప..(Neem)
వేప ఆకులను వైద్య చికిత్సలో ఎప్పటినుండో వాడుతున్నారు. వేపలో రోగనిరోధక శక్తి ఎక్కువ. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది. దీన్ని మూడు విధాలుగా తీసుకోవచ్చు. వేపఆకులను నమిలి తిని నీటిని తాగవచ్చు. వేప ఆకులను గ్రైండ్ చేసి జ్యూస్ లాగా చేసుకుని తాగవచ్చు. వేప ఆకులను నూరి చిన్న గోళీలు చేసి ఎండబెట్టి ఆ తరువాత పరగడపునే తీసుకోవచ్చు. వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్‌లను తొలగిస్తాయి.
ఇది కూడా చదవండి: రోజూ 2కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే.. జరిగేది ఇదే..!
వెల్లుల్లి..(Garlic)
వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఉసిరికాయ(Goose berry)
విటమిన్-సి పుష్కలంగా ఉన్న ఉసిరికాయలు కానీ, పౌడర్ కానీ, జ్యూస్ కానీ రోజూ తీసుకుంటే రక్తం శుద్ది అవుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది.
ఇది కూడా చదవండి: పిల్లలలో మొబైల్ వ్యసనం.. ఈ పనులు చేస్తే మాయం!
నిమ్మకాయ(Lemon)
ప్రతిరోజూ ఉదయాన్నేనిమ్మకాయ రసాన్ని వేడినీటిలో కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తం శుద్దికావడమే కాదు. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
(నోట్: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చెయ్యండి.