Share News

Nutmeg: వంటల్లో వాడే జాజికాయ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా? రోజూ చిటికెడు పొడిని తింటే..!

ABN , Publish Date - Dec 26 , 2023 | 04:24 PM

జాజికాయలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పొడిని రోజూ ఓ చిటికెడు తింటే జరిగేదిదే..

Nutmeg: వంటల్లో వాడే జాజికాయ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా? రోజూ చిటికెడు  పొడిని తింటే..!

వంటకాలకు, పానీయాలకు సువాసన జోడించేందుదు ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో జాజికాయ కూడా ఒకటి. ఇది తియ్యని సువాసనతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే దీన్ని పాన్ తయారీలో వాడుతుంటారు. మసాలా వంటల్లో దీన్ని మరింత ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరు చర్మ సంరక్షణలోనూ దీన్ని వాడతారు. జాజికాయలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పొడిని రోజూ ఓ చిటికెడు తింటే వెలకట్టలేనన్ని లాభాలు ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది భలే సహాయపడుతుంది. అవేంటో తెలుసుకుంటే..

జాజికాయ పొడి రోజూ ఓ చిటికెడు తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చట. రోజులో ఏదో ఒక సమయంలో చిటికెడు పొడిని గోరువెచ్చని నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు. ఇది శరీరంలో టాక్సిన్లను తొలగిస్తుంది. జీవక్రియ పెరగడానికి సహాయపడే జీర్ణ ఎంజైమ్ లు జాజికాయలో ఉంటాయి. ఈ కారణంగా జాజికాయ పొడిని తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!


తీసుకోవడానికి చిటికెడే అయినా దీంట్లో పైబర్ కంటెంట్ ఎక్కువే. దీన్ని తీసుకుంటే కడుపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయం చేస్తుంది.

నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి జాజికాయ గొప్ప వరమనే చెప్పవచ్చు. రాత్రి పడుకునే ముందు చిటికెడు జాజికాయ పొడిని గ్లాసుడు పాలలో వేసి తాగితే నిద్ర బాగా పడుతుంది.

బరువు పెరగడమనే సమస్యతో బాధపడేవారిలో అదే పనిగా ఆహారం తినాలని అనిపిస్తుంటుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, రుచికరమైన ఆహారాల మీద మనసు మళ్లుతుంటుంది. కానీ జాజికాయ పొడిని తీసుకుంటూ ఉంటే ఆహారం మీద కలిగే ఈ కోరికలు అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.

ఇది కూడా చదవండి: ఎక్కువ కాలం బ్రతకాలనుందా? ఈ సింపుల్ టిప్స్ తో ఆయుష్షు ఫుల్!


అధికశాతం మంది బరువు పెరగడానికి ముఖ్య కారణం ఒత్తిడి. శరీర కణాలు ఒత్తిడికి గురైనప్పుడు బరువు పెరగడం జరుగుతుంది. జాజికాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడి స్థాయిలను అదుపులో ఉంచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆక్సీరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

జాజికాయ మంచి ప్రయోజనాలను కలిగించినప్పటికీ దీన్ని చిటికెడుకు మించి తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకునేప్పుడు జాగ్రత్త అవసరం.

ఇది కూడా చదవండి: Hair Fall: జుట్టు బాగా రాలిపోతోందా? అయితే మీకూ ఈ లోపాలుండటం పక్కా..!


(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 04:24 PM