Healthy Hair: ఆరోగ్యమైన జుట్టు కోసం ఇలా చేయండి!

ABN , First Publish Date - 2023-05-18T13:03:09+05:30 IST

మందారపువ్వును ఇష్టపడని మహిళలుండరు. విరివిగా దొరికే మందారం చెట్టు ఆకులు, పూలతో జుట్టును సంరక్షించుకోవచ్చు. బలమైన, ఆరోగ్యకరమైన జుట్టుకోసం

Healthy Hair: ఆరోగ్యమైన జుట్టు కోసం ఇలా చేయండి!
Healthy Hair

మందారపువ్వును ఇష్టపడని మహిళలుండరు. విరివిగా దొరికే మందారం చెట్టు ఆకులు, పూలతో జుట్టును సంరక్షించుకోవచ్చు. బలమైన, ఆరోగ్యకరమైన జుట్టుకోసం మందారంతో జట్టు కట్టాల్సిందే. మందారం పూలు, ఆకులతో హెయిర్‌ ప్యాక్స్‌ ఇలా సులువుగా చేసుకోవచ్చు.

• గుప్పెడు ఆకుల్ని, అంతే పరిమాణంలో మందారం పూలను తీసుకుని కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్లను తాకేవరకూ పట్టించి నలభై నిముషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఫ్రెష్‌గా ఉంటుంది.

• ఆరేడు మందారపూలను, పదిహేను మందార ఆకులను తీసుకుని పేస్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె గోరువెచ్చగా వేడిచేయాలి. అది చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ను బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే కేశాలు గట్టిగా ఉంటాయి.

• నాలుగు టేబుల్‌ స్పూన్ల పెరుగులోకి, ఎండబెట్టిన మందార పూల పొడిని వేసి కలపాలి. ఈ చూర్ణాన్ని జుట్టుకు పట్టిస్తే మాడు చల్లగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

• రెండు టేబుల్‌ స్పూన్ల ఉసిరికాయలపొడికి, మరో రెండు టేబుల్‌ స్పూన్ల మందార పూల పొడిని జతచేసి నీటిని కొద్దిగా కలుపుతూ పేస్ట్‌ చేసకుని జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోయి.. మంచి ఫలితం ఉంటుంది.

• మందారపూలు, ఆకుల్ని సమాన పరిమాణంలో తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌ చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు నాలుగు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి మిశ్రమాన్ని మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను రెండు లేదా మూడుసార్లు పట్టించిన తర్వాత జుట్టు పెరుగుదల గమనించవచ్చు.

• రెండు స్పూన్లు ఎండబెట్టిన మందార ఆకులు పొడి, రెండు స్పూన్ల ఎండబెట్టిన మందార పూల పొడి కలపాలి. నిమ్మరసం కలుపుతూ పేస్ట్‌ చేసుకుని ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తాకేట్లు పట్టిస్తే జుట్టు పటిష్టంగా తయారవుతుంది. వెంట్రుకలు రాలే సమస్య ఉంటే తగ్గిపోతుంది.

Updated Date - 2023-05-18T13:03:09+05:30 IST