Pakistan : ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకుల వీరంగం.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ముట్టడి..

ABN , First Publish Date - 2023-05-15T15:54:50+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు అనేక కేసుల్లో గంపగుత్తగా ఉపశమనం కల్పించిన సుప్రీంకోర్టుపై సంకీర్ణ ప్రభుత్వంలో

Pakistan : ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకుల వీరంగం.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ముట్టడి..
Pakistan Supreme Court

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు అనేక కేసుల్లో గంపగుత్తగా ఉపశమనం కల్పించిన సుప్రీంకోర్టుపై సంకీర్ణ ప్రభుత్వంలోని పీడీఎం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సోమవారం సుప్రీంకోర్టును ముట్టడించారు. వీరు వీరంగం సృష్టిస్తూ ఉంటే, పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు.

దేశ రాజధాని నగరం ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పటికీ, నిరసనకారులు పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు రెడ్ జోన్‌లో ప్రవేశించారు. ఈ పరిణామాలను సెంట్రల్ పంజాబ్ సెక్రటరీ జనరల్ హమద్ అజహర్ తీవ్రంగా ఖండించారు. దేశ అత్యున్నత స్థాయి న్యాయ వ్యవస్థపై దాడి చేయడానికి గూండాలకు ఎందుకు అవకాశం ఇచ్చారని పోలీసులపై మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఓ మతపరమైన తీవ్రవాద సంస్థ పాకిస్థాన్ సుప్రీంకోర్టుపై దాడి చేసిందన్నారు. పోలీసులు వారికి మద్దతుగా నిలిచారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు గేట్లను ఎక్కడానికి సెమినరీ స్టూడెంట్స్‌కి పోలీసులు అవకాశం ఇచ్చారన్నారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజల మధ్యకు సాధారణ దుస్తులు ధరించినవారు చొరబడినట్లు, విధ్వంసానికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. నిరసనకారులపై నేరుగా కాల్పులు జరపడంతో డజన్ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు.

పీటీఐ పార్టీ సభ్యుడు జహన్‌జేబ్ పరచ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రపంచం ఈ పరిణామాలను గమనించాలన్నారు. మతపరమైన తీవ్రవాద పార్టీకి చెందిన ఆర్గనైజ్డ్ గూండాలు ఇస్లామాబాద్ రెడ్ జోన్‌లో ప్రవేశించి, సుప్రీంకోర్టుపై దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. పాకిస్థాన్ ప్రజల అభిప్రాయానికి, దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని జడ్జిలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఈ గూండాలకు ప్రభుత్వం, పోలీసులు, మిలిటరీ సంపూర్ణంగా సహకరిస్తున్నాయన్నారు. ఈ గూండాలు సెక్యూరిటీ చెక్ పోస్ట్‌ల నుంచి అదృశ్యమయ్యారన్నారు.

ఇవి కూడా చదవండి :

India and America : అమెరికాతో భారత్ వ్యూహాత్మక చర్చలు వచ్చే నెలలో

Church Pastor: కడుపు మాడ్చుకొని చనిపోతే జీసస్‌ను కలుస్తారు!

Updated Date - 2023-05-15T15:54:50+05:30 IST