Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కేన్సర్...ఛాతీ నుంచి కేన్సర్ కణజాలం తొలగింపు
ABN , First Publish Date - 2023-03-04T07:49:15+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఛాతీ వద్ద కేన్సర్ సోకడంతో వైట్ హౌస్ వైద్యులు చికిత్స చేశారు....
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఛాతీ వద్ద కేన్సర్ సోకడంతో వైట్ హౌస్ వైద్యులు చికిత్స చేశారు. జోబైడెన్(Joe Biden) కు చర్మ కేన్సర్ సోకడంతో అతని ఛాతీ నుంచి కేన్సర్ కణజాలాన్ని గత నెలలో తొలగించామని(Cancerous Lesion Removed) వైట్‌హౌస్ వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కానర్ చెప్పారు. కేన్సరుకు శస్త్రచికిత్స అనంతరం 80 ఏళ్ల అమెరికా(USA) అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యంగా ఉన్నారని వైట్ హౌస్ వైద్యులు ప్రకటించారు.
జో బైడెన్ కేన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని, రోజువారీ ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామని వైద్యులు చెప్పారు. జో బైడెన్ కు బేసల్ సెల్ కేన్సర్ సోకిందని, ఈ కేన్సర్ వ్యాప్తి చెందదని అందుకే కేన్సర్ కణాలను తొలగించామని వైద్యులు వివరించారు. బేసల్ సెల్ కేన్సర్ అంటే చర్మం ఉపరితలంపై ఏర్పడే కేన్సర్ అని వైద్యులు చెప్పారు.