Pakistan : తోషాఖానా కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ళ జైలు శిక్ష..

ABN , First Publish Date - 2023-08-05T13:45:54+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు శనివారం గట్టి షాక్ ఇచ్చింది. తోషాఖానా కేసులో ఆయన దోషి అని నిర్థరించి, ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,00,000 జరిమానా విధించింది. ఇమ్రాన్‌పై నమోదైన ఆరోపణలు రుజువైనట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ తెలిపారు.

Pakistan : తోషాఖానా కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ళ జైలు శిక్ష..

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు శనివారం గట్టి షాక్ ఇచ్చింది. తోషాఖానా కేసులో ఆయన దోషి అని నిర్థరించి, ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,00,000 జరిమానా విధించింది. ఈ జరిమానాను చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలపాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పు చెప్పింది. అంతేకాకుండా, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఇమ్రాన్‌పై నమోదైన ఆరోపణలు రుజువైనట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ఎన్నికల కమిషన్‌కు బూటకపు సమాచారాన్ని సమర్పించారని తెలిపారు. ఆయన అవినీతికి పాల్పడినట్లు రుజువైందన్నారు. పాకిస్థాన్ ఎన్నికల చట్టంలోని సెక్షన్ 174 ప్రకారం ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలను అమలు చేయడం కోసం ఈ ఆదేశాల నకలును ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్‌కు పంపించాలని ఆదేశించారు.

విదేశీ ప్రభుత్వ అధికారులు, నేతలు పాకిస్థాన్ నేతలు, పార్లమెంటేరియన్లు, అధికారులకు ఇచ్చే బహుమతులను భద్రపరచే శాఖను తోషాఖానా అంటారు. ఇది కేబినెట్ డివిజన్ నియంత్రణలో పని చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో తనకు వచ్చిన బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఆయన అవినీతికి పాల్పడినట్లు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆయన తప్పుడు స్టేట్‌మెంట్లు, అవాస్తవ ప్రకటనలు చేశారని ఆరోపణలు వచ్చాయి.


తోషాఖానా బహుమతుల వివరాలను దాచిపెట్టినందుకు పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఖాన్‌పై క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేసింది. దీని ఆధారంగా అధికార పార్టీ సభ్యులు కేసు దాఖలు చేశారు. దీనిపై మే 10న ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువయ్యాయని అడిషినల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ శనివారం తీర్పు చెప్పారు. ఇమ్రాన్ ఉద్దేశపూర్వకంగానే బూటకపు వివరాలను సమర్పించారని తెలిపారు. ఆయన అవినీతికి పాల్పడినట్లు రుజువైందన్నారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 174 ప్రకారం ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,00,000 జరిమానా విధించారు.

ఇమ్రాన్ అరెస్ట్

ఈ తీర్పు వెలువడిన కాసేపటికే ఇమ్రాన్‌ను లాహోర్‌లో అరెస్ట్ చేసినట్లు ఆయన నేతృత్వంలోని పార్టీ పీటీఐ ట్వీట్ చేసింది. ఆయనను కోట్ లఖ్‌పత్ జైలుకు తీసుకెళ్తున్నట్లు తెలిపింది.

ఎన్నికల్లో పోటీకి అనర్హత

తోషాఖానా బహుమతుల విషయంలో ఇమ్రాన్ అనేక న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొన్నారు. చివరికి ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని అధికరణ 63(1)(పీ) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేసింది.


ఇవి కూడా చదవండి :

Nuh violence : ఇళ్ల పై కప్పులపై రాళ్లు పోగేశారు, గుట్టల మీదకు ఎక్కారు.. భక్తులపై దాడి చేశారు.. : హర్యానా హోం మంత్రి

Gyanvapi : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే పునఃప్రారంభం

Updated Date - 2023-08-05T14:14:10+05:30 IST