Navy Plane: విమానం పడవలా మారితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా?.. ఈ వీడియో మీ కోసమే..
ABN , First Publish Date - 2023-11-21T12:50:41+05:30 IST
అమెరికా నౌకాదళానికి చెందిన ఓ భారీ నిఘా విమానం సముద్రంలోకి దూసుకెళ్లింది. సముద్రంలో ఒక పడవ మాదిరిగా విమానం తేలియాడింది. అంతపెద్ద విమానం సముంద్రంలో పడవ మాదరిగా తేలియడడాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వాషింగ్టన్: అమెరికా నౌకాదళానికి చెందిన ఓ భారీ నిఘా విమానం సముద్రంలోకి దూసుకెళ్లింది. సముద్రంలో ఒక పడవ మాదిరిగా విమానం తేలియాడింది. అంతపెద్ద విమానం సముంద్రంలో పడవ మాదరిగా తేలియడడాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అమెరికా నౌకాదళానికి చెందిన పీ-8ఏ పొసెడాన్ నిఘా విమానం రన్‌వేపై అదుపుతప్పింది. పక్కనే ఉన్న సముద్రంలోకి దూసుకెళ్లింది. అక్కడే సముద్రంలో బోటింగ్ చేస్తున్నవారు విమానం నీటిపై తేలియడడాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే తమ మొబైల్స్‌లో ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదృష్టం కొద్దీ విమానంలో ఉన్న సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం సమయంలో విమానంలో మొత్తం 9 మంది సిబ్బంది ఉన్నారు.
హోనోలులు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి షేన్ ఎన్‌రైట్ విమానంలోని సైనిక సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. హవాయిలోని మెరైన్ కోర్ బేస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం ప్రమదానికి గురైన విషయాన్ని కోర్ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్ అధికారికంగా ప్రకటించారు. కాగా అమెరికా నౌకాదళంలో పీ-8ఏ పొసెడాన్ విమానం కీలక పాత్ర పోషిస్తుంటుంది. భారీగా ఇంటెలిజెన్స్‌ను సేకరించడంతోపాటు టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను కూడా తీసుకెళ్లగలదు. సబ్‌మెరైన్లను గుర్తించి వాటిపై దాడి చేయగలదు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయనే విషయం వెల్లడికాలేదు. పెట్రోల్ స్వాడ్రన్ కనోహె బే కేంద్రంగా ఈ విమానం పని చేస్తోంది. మెరైన్ కోర్ ప్రధాన స్థావరం కూడా హవాయిలోనే ఉంది. 2009లో కూడా అమెరికాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ భారీ విమానం హడ్సన్ నది మధ్యలో నీటిపై దిగింది. కానీ ఆ సమయంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ప్రస్తుతం ఈ పీ8 విమానాలను అమెరికాతోపాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, నార్వే దేశాలకు చెందిన సైన్యాలు కూడా వాడుతున్నాయి.