రెండేళ్ల క్రితం పెళ్లి.. నేరుగా స్టేషన్‌కు వెళ్లిన భార్య.. భర్త గురించి ఆమె చెప్పిన నిజాలు విని అవాక్కైన పోలీసులు..
ABN , First Publish Date - 2023-02-11T15:32:40+05:30 IST
తనను అర్థం చేసుకునే భర్త వచ్చాడని ఎంతో మురిసిపోయింది. వివాహమైన కొత్తలో భార్యను అంత బాగా చూసుకున్న భర్త ప్రవర్తనలో రాను రాను మార్పు వచ్చింది. అప్పటిదాకా బాగున్న భర్త.. ఒక్కసారిగా శాడిస్టుగా మారడంతో ఆమెకు మొదట ఏమీ అర్థం కాలేదు. కానీ..
తనను అర్థం చేసుకునే భర్త వచ్చాడని ఎంతో మురిసిపోయింది. వివాహమైన కొత్తలో భార్యను అంత బాగా చూసుకున్న భర్త ప్రవర్తనలో రాను రాను మార్పు వచ్చింది. అప్పటిదాకా బాగున్న భర్త.. ఒక్కసారిగా శాడిస్టుగా మారడంతో ఆమెకు మొదట ఏమీ అర్థం కాలేదు. కానీ రోజు రోజుకూ రాక్షసుడిలా మారిపోవడంతో భరించలేకపోయింది. చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త గురించి చెప్పిన నిజాలు విని పోలీసులు అవాక్కయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
జార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీ పరిధి సదర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మహిళకు బద్గై ప్రాంతానికి చెందిన యువకుడితో 2021లో వివాహమైంది. పెళ్లయిన కొన్ని నెలలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే నెలల గడిచే కొద్దీ దంపతుల (couple) మధ్య గొడవలు మొదలయ్యాయి. చీటికీమాటికీ భార్యను (Harassment) వేధించేవాడు. ఏ కారణమూ లేకున్నా.. ఏదో ఒక సాకు చూపుతూ భార్యకు నరకం చూపిస్తూ ఉండేవాడు. తన భర్త ఎందుకు ఇలా చేస్తున్నాడో ఆమెకు మొదట అర్థమయ్యేది కాదు. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా భర్త మొబైల్ పరిశీలించింది. అయితే అందులో ఉన్న కొన్ని వీడియోలు (Mobile videos) చూసి షాక్ అయింది.
ఇతర పురుషులతో కలిసి తన భర్త అసభ్యకర స్థితిలో (Indecent status) ఉండడం చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఇదే విషయాన్ని తన భర్త వద్ద ప్రస్తావించి.. ఏంటీ పనులు.. అంటూ నిలదీసింది. తన గురించి భార్యకు తెలియడంతో అతను భరించలేకోయాడు. అప్పటి నుంచి ఆమెను మరింతగా హింసించేవాడు. చివరకు విసిగిపోయి.. పోలీసులను ఆశ్రయించింది. తన భర్త స్వలింగ సంపర్కుడని (Homosexuals) తెలుసుకున్నానని, మనుషులతోనే కాకుండా జంతువులతోనూ సంపర్కం చేస్తున్నాడని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి తనను మరింత వేధిస్తున్నాడని, ఎప్పుడైనా తనను చంపేయవచ్చని బోరున విలపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.