Kamalakanni:108 ఏళ్ల వయసులో.. రెండు భాషల్లో...
ABN , First Publish Date - 2023-04-09T21:17:55+05:30 IST
తమిళనాడులోని(Tamil Nadu) థేని జిల్లాకు చెందిన కమలకన్ని(Kamalakanni) వయసు 108 ఏళ్లు.
చెన్నై: తమిళనాడులోని(Tamil Nadu) థేని జిల్లాకు చెందిన కమలకన్ని(Kamalakanni) వయసు 108 ఏళ్లు. చదువులకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. కేరళ(Kerala) ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలలో పాసై తమిళం(Tamil), మలయాళ(Malayalam) భాషలను నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రెండో తరగతి వరకు చదివిన కమలకన్ని కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి వలసపోయి కూలీపనులను చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు.
పేదరికం కారణంగా చిన్నప్పుడు చదవలేకపోయిన కమలకన్నికి ఇటీవలే చదవాలనే కోరిక కలిగింది. కేరళ ప్రభుత్వ నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమం సంపూర్ణ శాస్త్ర (Sampoorna Shastra literacy program) భాగంగా తమిళ, మలయాళ భాషలకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్నారు. అక్కడి ప్రభుత్వ శిక్షణా సంస్థలో చేరి పట్టుదలగా చదివారు. తన మాతృభాష తమిళం, అటు మలయాళ భాషను నేర్చుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు భాషలలో రాయగలుగుతున్నారు. ఈ పరీక్షలలో ఆమె 100 మార్కులకు గాను 97మార్కులు సంపాదించుకున్నారు.