Asteroid: భూమివైపు దూసుకొస్తున్న దాదాపు కిలోమీటర్ వెడల్పు ఉన్న 2 అస్టరాయిడ్స్..

ABN , First Publish Date - 2023-06-12T15:48:27+05:30 IST

రెండు భారీ గ్రహశకలాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. సూర్యుని చుట్టూ ఉన్న తమ కక్ష్యలలో ఇవి ముందుకు కదులుతున్నాయి.

Asteroid: భూమివైపు దూసుకొస్తున్న దాదాపు కిలోమీటర్ వెడల్పు ఉన్న 2 అస్టరాయిడ్స్..

న్యూఢిల్లీ : రెండు భారీ గ్రహశకలాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. సూర్యుని చుట్టూ ఉన్న తమ కక్ష్యలలో ఇవి ముందుకు కదులుతున్నాయి. వీటి వ్యాసం 500 మీటర్ల నుంచి 850 మీటర్ల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. Asteroid 488453 (1994 XD), Asteroid 2020 DB5 అని వీటికి పేర్లు పెట్టారు.

Asteroid 488453 (1994 XD) ఈ నెల 12న భూమికి చేరువగా వస్తుంది. ఇది గంటకు 77,292 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది భూమికి 31,62,498 కిలోమీటర్ల చేరువకు వస్తుంది. 2012 నవంబరు 27న ఓ గ్రహశకలం భూమికి చేరువగా వచ్చింది. మళ్లీ ఇది 2030లో భూమి సమీపానికి వస్తుంది. ఇది దీని కక్ష్యలో తిరుగుతోంది.

Asteroid 2020 DB5 జూన్ 15న భూమికి సన్నిహితంగా వస్తుంది. వీటి వ్యాసం 150 మీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నందువల్ల ఇవి ప్రమాదకరమైనవేనని వర్గీకరించారు. ఇది భూమికి 43,08,418 కిలోమీటర్ల సమీపానికి వస్తుంది. ఇది గంటకు 34,272 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది 1985లో కూడా భూమి సమీపానికి వచ్చింది.

ఈ గ్రహశకలాలను జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ట్రాక్ చేస్తోంది. ఇది 2048 మే 2న మళ్లీ భూమికి సమీపానికి వస్తుంది. అత్యధిక గ్రహశకలాల వల్ల ముప్పు ఏమీ ఉండదు. అయితే ఏదైనా ముప్పు సంభవిస్తుందని వెల్లడైనపుడు అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం వీటిని ట్రాక్ చేయడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి :

Modi ji thali : మోదీ అమెరికా పర్యటన.. ‘మోదీజీ థాలీ’ని ప్రారంభించిన అమెరికన్ రెస్టారెంట్..

NDA : కొత్త పార్లమెంటులో ‘సెంగోల్’ ప్రతిష్ఠ.. తమిళులకు అమిత్ షా టార్గెట్..

Updated Date - 2023-06-12T15:48:27+05:30 IST