Dwarka: శ్రీకృష్ణుడిపై భక్తి.. 37 వేల మంది మహిళలు ఒకేసారి ప్రదర్శన
ABN , Publish Date - Dec 25 , 2023 | 02:05 PM
గుజరాత్‌లో అహిర్ కమ్యూనిటీకి చెందిన దాదాపు 37,000 మంది మహిళలు శ్రీ కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు.
అహ్మదాబాద్: గుజరాత్‌లో అహిర్ కమ్యూనిటీకి చెందిన దాదాపు 37,000 మంది మహిళలు శ్రీ కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. కృష్ణ పరమాత్ముడిపై భక్తిలో ముగిని తేలారు. గుజరాత్‌లోని ప్రసిద్ధ ద్వారకా ఆలయంలో జరిగిన మహారాస్‌లో మహిళలు ఈ ప్రదర్శన ఇచ్చారు. 37 వేల మంది మహిళలు సాంప్రదాయ ఎరుపు రంగు దుస్తులను ధరించి గోధుమ రంగు మైదానంలో నృత్యం చేశారు. 37 వేల మంది మహిళలంతా కలిసి ఒకేలా నృత్యం చేయడం అద్భుతంగా అనిపించింది. స్థానిక వెబ్‌సైట్ ప్రకారం.. మహా రాస్ అనేది ద్వారకలో బాణాసురుని కుమార్తె, శ్రీకృష్ణుడి కోడలు అయిన ఉషచే నిర్వహించేబడే రెండు రోజుల పండుగ. ఆల్ ఇండియా యాదవ సమాజ్, అహిరాణి మహిళా మండల్ ఆధ్వర్యంలో నంధం క్యాంపస్‌గా పిలిచే ఏసీసీ సిమెంట్ కంపెనీ క్యాంపస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సామరస్యం, మహిళా సాధికారత సందేశాన్ని అందించడమే ఈ మహారాస్ లక్ష్యం. మహిళా నృత్యాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.