Narendra Putin : 2024లో బీజేపీ గెలిస్తే, మోదీ ‘నరేంద్ర పుతిన్’ అవుతారు : పంజాబ్ సీఎం
ABN , First Publish Date - 2023-06-11T13:44:40+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ (Bhagwant Mann) ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ (Bhagwant Mann) ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘నరేంద్ర పుతిన్’ అవుతారని హెచ్చరించారు. ఢిల్లీ రాష్ట్రంలో ఉద్యోగుల పోస్టింగ్‌లు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, ఇక దేశంలో ఎన్నికలు ఉండవన్నారు. నరేంద్ర మోదీ ‘నరేంద్ర పుతిన్’ అయిపోతారన్నారు. బీజేపీ నేతలు మోదీని భారత దేశ యజమానిగా భావిస్తున్నారన్నారు. 140 కోట్ల మంది భారతీయులు దేశాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంటే, దేశం సురక్షితంగా ఉంటుందన్నారు.
ఢిల్లీ రాష్ట్రంలోని బ్యూరోక్రాట్ల పోస్లింగులు, బదిలీలపై అధికారాన్ని నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీకి కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను మే 19న తీసుకొచ్చింది. ఢిల్లీ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఈ అంశంపై అధికారం ఉంటుందని అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు ఈ మైదానంతోపాటు, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (AAP national convener Arvind Kejriwal), ఢిల్లీ రాష్ట్ర మంత్రి గోపాల్ రాయ్, ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Wrestlers : ఆధారాలివ్వండి : ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు
Congress : కాంగ్రెస్‌కు అంతు చిక్కని సచిన్ పైలట్ వ్యవహారం