AIADMK: లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌.. సంస్థాగత మార్పులకు మాజీసీఎం శ్రీకారం

ABN , First Publish Date - 2023-09-29T11:29:23+05:30 IST

పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా అన్నాడీఎంకే(AIADMK)లో సంస్థాగత మార్పులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,

AIADMK: లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌.. సంస్థాగత మార్పులకు మాజీసీఎం శ్రీకారం

పెరంబూర్‌(చెన్నై): పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా అన్నాడీఎంకే(AIADMK)లో సంస్థాగత మార్పులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) శ్రీకారం చుట్టారు. 17 జిల్లాలకు కొత్త కార్యదర్శులు, ఖాళీ పదవులకు నిర్వాహకులను నియమిస్తూ బుధవారం రాత్రి ఆయన ప్రకటించారు. దీంతో, ఆ పార్టీ జిల్లా కార్యదర్శుల సంఖ్య 82కి చేరింది. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం ఈ నెల 25న రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌ భవనంలో జరిగింది. ఈ సమావేశం అనంతరం బీజేపీ కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలుతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొంనేలా సంస్థాగత మార్పులు చేపట్టాలని, జిల్లా కార్యదర్శుల సంఖ్య పెంచేందుకు పళనిస్వామి అంగీకారం తెలిపారు. ఆ ప్రకారం, పార్టీ నిర్వహణ రీత్యా 72 ఉన్న జిల్లాల సంఖ్యను 82కు పెంచారు. మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam మద్దతుదారులు, మాజీ మంత్రులు ఆర్‌.వైద్యలింగం, వెల్లమండి నటరాజన్‌ స్థానాలు సహా ఖాళీ ఉన్న ఆరు జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి వాటికి కార్యదర్శులను నియమించారు. తిరుత్తణి (రిజర్వ్‌డ్‌), షోలింగర్‌ తదితర నియోజకవర్గాలు కలిగిన రాణిపేట తూర్పు జిల్లా కార్యదర్శిగా ఎమ్మెల్యే ఎస్‌. రవి, రాణిపేట, ఆర్కాడు నియోజకవర్గాలు కలిగిన రాణిపేట పడమర జిల్లా కార్యదర్శిగా ఎస్‌ఎం సుకుమార్‌ నియమితులయ్యారు. తిరువణ్ణామలై, కీలపెన్నాత్తూర్‌ నియోజకవర్గాలు కలిగిన తిరువణ్ణామలై తూర్పు జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి ఎస్‌.రామచంద్రన్‌, సెయ్యారు, వందవాసి (రిజర్వ్‌డ్‌) నియోజకవర్గాలు కలిగిన తిరువణ్ణామలై ఉత్తర జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే దూసి కె.మోహన్‌, కలశపాక్కం, సెంగం (రిజర్వ్‌డ్‌) నియోజకవర్గాలు కలిగిన తిరువణ్ణామలై దక్షిణ జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి అగ్రిఎ్‌సఎస్‌ కృష్ణమూర్తి నియమితులయ్యారు. కన్నియాకుమారి తూర్పు జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే దళవాయి సుందరం సహా పలు కొత్త జిల్లాలకు కార్యదర్శులు నియమితులయ్యారు. అలాగే, పార్టీలోని వివిధ విభాగాలకు కూడా కొత్త వారిని ఎంపిక చేస్తూ పళనిస్వామి ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2023-09-29T11:29:23+05:30 IST