Home » AIADMK
అన్నాడీఎంకే పార్టీ చిహ్నామైన రెండాకుల గుర్తు విషయంలో ఏర్పడ్డ విభేదాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా అన్నాడీఎంకే పార్టీ మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్దామి, పన్నీర్ సెల్వంలను 28ంతేదీన విచారణకు రావాలని ఆదేశించింది.
అధికారంలో భాగస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ పలు సర్వేలు ఇప్పటికే సూచన ప్రాయంగా వెల్లడించాయన్నారు.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి తావులేదని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై అన్నారు. 2026లో ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా.. మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు.
‘ఆలూ లేదు.. చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది అన్నాడీఎంకే - బీజేపీ కార్యకర్తల తీరు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే కొందరు బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి నయినార్ నాగ్రేందన్ అంటూ ప్లెక్సీలు వేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
మరో ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే, మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి డి.జయకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ నుంచి వైదొలగే ప్రసక్తే లేదంటూ ఆయన అన్నారు. అంతేగాక తాను పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అడుగుకూడా పెట్టలేదని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై అన్నారు. ఈ వ్యా్ఖ్యలు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి. ఓపక్క గత రెండు రోజుల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం, మరోవైపు అధికార డీఎంకే, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ పలు విమర్శలు చేస్తుండడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
మహిళలను కించపరచడం డీఎంకే పార్టీ నేతలకు అలవాటేనని అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెల్లూరు రాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొన్ముడి మాత్రమే కాదు, డీఎంకే నేతల్లో పలువురు మహిళలకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడం అలవాటేనన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు కుదరడంపై డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇళాంగోవన్ సూటిగా స్పందించారు.
అన్నాడీఎంకేకు ఎలాంటా షరతులు, డిమాండ్లు లేవని అమిత్షా చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చోసుకోమని, పొత్తుల వల్ల అటు ఎన్డీయేకు, అన్నాడీఎంకే కూడా లబ్ధి చేకూరనుందని తెలిపారు.