Ananthapuri Express: 1 నుంచి సూపర్‌ఫాస్ట్‌గా అనంతపురి ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2023-09-28T08:55:52+05:30 IST

అనంతపురి ఎక్స్‌ప్రెస్‌(Ananthapuri Express)ను అక్టోబరు 1వ తేది నుంచి సూపర్‌ఫాస్ట్‌ రైలుగా నడపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు.

Ananthapuri Express: 1 నుంచి సూపర్‌ఫాస్ట్‌గా అనంతపురి ఎక్స్‌ప్రెస్‌

ఐసిఎఫ్‌(చెన్నై): అనంతపురి ఎక్స్‌ప్రెస్‌(Ananthapuri Express)ను అక్టోబరు 1వ తేది నుంచి సూపర్‌ఫాస్ట్‌ రైలుగా నడపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. చెన్నై ఎగ్మూర్‌ నుంచి కేరళ రాష్ట్రం కొల్లంకు రాత్రి 8.10 గంటలకు, కొల్లం నుంచి ఎగ్మూర్‌కు ప్రతిరోజు సాయంత్రం 3.40 గంటలకు అనంతపురి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లను 1వ తేది నుంచి సూపర్‌ఫాస్ట్‌ రైళ్లుగా మార్చనున్నారు. ఈ రైలు 20 నిమిషాల ముందుగా అంటే రాత్రి 7.40 గంటలకు ఎగ్మూర్‌ నుంచి బయల్దేరుతుంది. తిరుచ్చికి అర్ధరాత్రి 1.30 గంటలకు బదులుగా 1.05 గంటలకు, మదురైకు వేకువజామున 3.05కు బదులుగా 3.20కు, తిరునల్వేలికి ఉదయం 6.30 గంటలకు బదులుగా 6.05 కు, కొల్లంకు మరుసటిరోజు ఉదయం 11.40 గంటలకు బదులుగా 11.15 గంటలకు చేరుకుంటుంది. మరో మార్గం గా కొల్లం నుంచి మధ్యాహ్నం 3.40 గంటలకు బయ ల్దేరడానికి బదులుగా 50 నిమిషాలు ముందుగా మధ్యా హ్నం 2.50 గంటలకు బయల్దేరి ఎగ్మూర్‌కు మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు వచ్చి చేరుతుందని దక్షిణ రైల్వే తెలిపింది.

nani6.jpg

Updated Date - 2023-09-28T08:55:52+05:30 IST