Ashok Gehlot :1 కాదు.. 2 కాదు.. ఏకంగా 7 నిమిషాల పాటు గతేడాది బడ్జెట్‌ను చదివారు..
ABN , First Publish Date - 2023-02-10T13:42:09+05:30 IST
రాజస్థాన్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏకంగా సీఎం అశోక్ గెహ్లాటే తప్పులో కాలేశారు. ఆర్థిక శాఖను తన కిందే ఉంచుకున్న సీఎం.. నేడు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పనికి నవ్వులపాలయ్యారు.
Jaipur : రాజస్థాన్ అసెంబ్లీ (Rajastan Assembly)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏకంగా సీఎం అశోక్ గెహ్లాటే (CM Ashok Gehlot) తప్పులో కాలేశారు. అశోక్ గెహ్లాట్.. నేడు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పనికి నవ్వులపాలయ్యారు. గత ఏడాది (Last Year) బడ్జెట్ (Budget) ప్రతులను తీసుకొచ్చి.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు నిమిషాల పాటు చదివి నాలుక కరుచుకున్నారు. ఇక ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? అవకాశం దొరికితే ఒక్కాట ఆడుకునే ప్రతిపక్షాలకు ఇంతటి తప్పిదం ఏకంగా సీఎమ్మే చేస్తే ఊరుకుంటాయా? దారుణంగా ఎగతాళి చేశాయి. దెబ్బకు విషయం అర్ధమై బడ్జెట్ చదవడం ఆపేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అసెంబ్లీ (Rajastan Assembly)లో నవ్వులపాలయ్యారు. నేడు బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో గత ఏడాది ప్రతిని చదివారు. దాదాపు 7 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం సాగింది. ప్రతిపక్ష సభ్యులు ఎగతాళి చేయడంతో గెహ్లాట్‌కు ఏం జరిగిందనేది స్ఫురణకు వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రతిపక్ష సభ్యులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని నిలిపివేశారు. ఈ గందరగోళం నడుమ సభ అరగంట పాటు వాయిదా పడింది. మొత్తానికి ఈ వార్త క్షణాల్లోనే దేశమంతా పాకింది.