PM Modi's Australia Visit : మోదీ అంటే మావాళ్లకు అసూయ : ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత
ABN , First Publish Date - 2023-05-26T21:26:46+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని చూసి తమ దేశ రాజకీయ నేతలు అసూయ చెందుతున్నారని ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత పీటర్ డుట్టన్ చెప్పారు.
సిడ్నీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని చూసి తమ దేశ రాజకీయ నేతలు అసూయ చెందుతున్నారని ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత పీటర్ డుట్టన్ చెప్పారు. పీటర్ గురువారం ఆస్ట్రేలియన్ పార్లమెంటులో మాట్లాడుతూ, సిడ్నీలో ఇటీవల మోదీ పాల్గొన్న ఓ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీకి ఆతిథ్యం ఇవ్వడంలో భారత సంతతి ప్రజలు చేసిన కృషిని అభినందించారు.
రాజకీయాల్లోని ఇరు పక్షాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారని, తాను ఈరోజు ఉదయం మోదీతో మాట్లాడానని, గత రాత్రి కార్యక్రమానికి హాజరైన ప్రతి రాజకీయ నాయకుడు మిమ్మల్ని చూసి అసూయ చెందుతున్నారని చెప్పానని తెలిపారు. 20 వేల మంది ముక్తకంఠంతో ‘‘మోదీ.. మోదీ..’’ అని నినాదాలు చేయడాన్ని చూసి ఆస్ట్రేలియన్ రాజకీయ నేతలు ఈర్ష్యపడుతున్నారని చెప్పానన్నారు. ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఇలా జరగడం అసాధారణమైన విషయమని చెప్పారు.
మోదీ ఈ నెల 23న సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, భారత్ మాతాకీ జై, వందేమాతరం, మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేశారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మోదీని ‘ది బాస్’ అని సంబోధించారు. మోదీని లెజెండరీ రాక్‌స్టార్ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌తో పోల్చారు. బ్రూస్‌ను ఆయన అభిమానులు ‘ది బాస్’ అని పిలుచుకుంటారు.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు అనుమతి
New Parliament Building : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు