Holi: హోలీ గొప్పతనాన్ని తెలియచెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని

ABN , First Publish Date - 2023-03-08T22:16:37+05:30 IST

భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.

Holi: హోలీ గొప్పతనాన్ని తెలియచెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని
Australian PM Anthony Albanese attend Holi celebration

అహ్మదాబాద్: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ (Australian Prime Minister Anthony Albanese) గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని (Sabarmati Ashram Gujarat Ahmedabad)సందర్శించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌‌తో కలిసి ఆయన ఆశ్రమంలో కలియతిరిగారు. చరఖాతో నూలు వడికే విధానాన్ని చూశారు. మహాత్మాగాంధీ(Mahatma Gandhi) విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకు ముందు ఆంటొనీ అహ్మదాబాద్‌లోని రాజ్‌భవన్‌లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా అక్కడి వారిపై రంగులు, పూలు చల్లారు. చెడుపై మంచి సాధించిన విజయంగా హోలీ(Holi) పండుగ విశిష్టతను వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 9న చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ(Narendra Modi) స్టేడియంలో జరగనుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ హాజరుకానున్నారు. మ్యాచ్‌ను ఇద్దరు ప్రధానులు తిలకిస్తారు.

Updated Date - 2023-03-08T22:16:40+05:30 IST