Home » IndiaVsAustralia
అది 14 మార్చి 2001. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. భారత దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ నాడు సృష్టించిన అద్భుతం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అదొక పెను సంచలనం.
ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియాకు ఎదురవుతున్న పరాజయాల పరంపర మరోసారి కొనసాగింది. సీనియర్ జట్టు దారిలోనే జూనియర్లు కూడా నడిచారు. దీంతో ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది.
భారత్‌తో జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు ముందుగా ఫీల్డింగ్ చేయనుంది.
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ పోరులో నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ ఫైనల్ పోరులో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో రెండు జట్లు ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌లో అడుగుపెట్టాయి.
త్వరలో ప్రారంభం కాబోయే సౌతాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కోహ్లీ ఇప్పటికే బీసీసీఐ, సెలెక్టర్లకు సమాచారం ఇచ్చినట్టు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి.
2nd T20 Match Pitch Report: భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి టీ20 గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అధిక్యాన్ని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉంది.
భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచి సిరీస్‌లో అధిక్యంలోకి వెళ్లిన టీమిండియా రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం ఈ మ్యాచ్‌లో మన జట్టు అన్ని విభాగాల్లో రాణించాలని పట్టుదలగా ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో మన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
Team India Head coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే అంతటా వినిపిస్తున్నాయి. కోచ్‌గా కొనసాగడానికి ద్రావిడ్ ఆసక్తి కనబర్చడం లేదని ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ద్రావిడ్ స్థానంలో నూతన హెడ్ కోచ్‌గా తెలుగు వ్యక్తి, ద్రావిడ్ సహచర క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రానున్నాడని సమాచారం
అసలే వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిన బాధలో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి మధ్యలోనే నిష్క్రమించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో కోలుకునేలా కనిపించడంలేదు.
ప్రపంచకప్ ఫైనల్‌లో అనూహ్య రీతిలో ఓడిన టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఆదివారం జట్టు ఓడిన అనంతరం స్వయంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన ఆయన ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. వారితో ప్రేమగా మాట్లాడిన మోదీ ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు.