Ballari: చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి
ABN , First Publish Date - 2023-09-17T12:47:12+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను సీఐడీ
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను సీఐడీ అక్రమ అరెస్టు చేయడంపై కర్ణాటకలోనూ ప్రజాసంఘాలు, చంద్రబాబు అభిమాన సంఘాలు, ప్రవాసాంధ్రులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఆయనను వెంటనే రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శనివారం బళ్లారిలోని విద్యానగర్ వద్ద నారా చంద్రబాబు నాయుడు అభిమానులు, టీడీపీ అభిమానులు, ప్రజాసంఘాలు ఒక చోటుకు చేరి ఆదివారం చేపట్టనున్న నిరసన ర్యాలీకి సంబంధించి చర్చించారు. ఆదివారం ఉదయం దుర్గామాత దేవాలయం నుంచి డీ.సీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ, నిరసన తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి మేధావిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం భాదాకరం అని ప్రజాసంఘాలు విమర్శించాయి. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి వేలాది మంది టీడీపీ అభిమానులు, చంద్రబాబు శ్రేయోభిలాషులు తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు.