Ballary: సైకో జగన్ పోవాలి- సైకిల్ రావాలి.. అంటూ పెద్దఎత్తున నిరసన
ABN , First Publish Date - 2023-10-03T12:48:26+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు(Former Chief Minister Narachandra Babu Naidu)
- చంద్రబాబుకు మద్దతుగా.. బళ్లారిలో భారీగా కొవ్వొత్తులతో ర్యాలీ
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు(Former Chief Minister Narachandra Babu Naidu) అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ బళ్లారిలో సోమవారం సాయంత్రం వందలాది మంది కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక వాసవీ పాఠశాల నుంచి కొవ్వొత్తులతో ర్యాలీగా విమ్స్ దగ్గర ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు సాగారు. సైకో జగన్ పోవాలి- సైకిల్ రావాలి, సత్యమేజయతే అంటూ నినాదాలు చేశారు. బళ్లారిలోని వివిధ సంఘాల ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కమ్మసంఘం నాయకులు, కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం నాయకులు గర్రం లాల్మోహన్, మోహన్‌దాసు, సోమల వెంకటనాయుడు, కాకర్లతోట విజ్జి, కొత్తపల్లి తిమ్మరాజులు, కుడితిని శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆరాచక పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు ఏమి తప్పుచేశారని జైల్లో పెట్టారని ప్రశ్నించారు. ఆయన కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో ప్రముఖులు బి.మల్లికార్జున, నాగరాజు, రవి, ప్రభాకర్‌నాయుడు, ఎలమంచలి శ్రీనివాస్, సురేశ్, రామాంజనేయులు, చత్రయ్య, వైకుంట, నందీశ్బాబు, గురుప్రసాద్, విజయ్‌కుమార్, శివప్ప, కె.నాయుడు, విక్కీ, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, విజయ్‌కుమార్, జయరాములు, రామానాయుడు, ప్రభంజన్ తదితరులు పాల్గొన్నారు.