Ballary: సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి.. అప్పుడే ఏపీ ప్రజలు బాగుపడతారు

ABN , First Publish Date - 2023-09-18T12:03:51+05:30 IST

ఏపీలో సైకో పాలన పోయి.. సైకిల్‌ రావాలని, అప్పుడే ఆంధ్రాలో అభివృధ్ది సాధ్యమని టీడీపీ అభిమానులు నినదించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,

Ballary: సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి.. అప్పుడే ఏపీ ప్రజలు బాగుపడతారు

- చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడు

- అక్రమ అరెస్టుపై అభిమానుల ఆగ్రహం

బళ్లారి, (ఆంధ్రజ్యోతి): ఏపీలో సైకో పాలన పోయి.. సైకిల్‌ రావాలని, అప్పుడే ఆంధ్రాలో అభివృధ్ది సాధ్యమని టీడీపీ అభిమానులు నినదించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబనును అక్రమంగా అక్రమంగా అరెస్ట్‌ చేశారని, సీఎం జగన్‌(CM Jagan) అన్యాయంగా ఆయన్ని ఇరికించారన్నారు. అవసరం అయితే చంద్రబాబుపై మోపిన అసత్య స్కాం కు సంబందించి డబ్బులు మేమే చందాలు వేసుకుని చెల్లిస్తాము చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలిని పలువురు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడు, జగన్‌ సైకో పాలనకు త్వరలో విముక్తి కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

స్వచ్ఛందంగా చంద్రబాబుకు మద్దతు: కాకర్లతోట విజ్జీ

చంద్రబాబు అరెస్టును ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ర్యాలీకి పిలుపునివ్వగానే ప్రజలు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు. 73 ఏళ్ల వ యస్సులో చంద్రబాబు ను అక్రమ అరెస్టు చేసి జగన్‌ తన రాక్షసత్యం నిరూపించుకున్నారు. జగన్‌ ఇంతకు రెట్టింపు మూల్యం చెల్లించుకోక తప్పదు.

చంద్రబాబును జైల్లో పెట్టడం దుర్మార్గపు చర్య: కోనంకి రామప్ప

చంద్రబాబు నాయుడు ఒక గొప్ప విజన్‌ ఉండే నాయకుడు, అలాంటి వ్యక్తికి కేవలం రాజకీయ కారణంతో అక్రమ అరెస్టు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకునేది లేదు. అ లాంటి గొప్ప వ్యక్తులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంకే సిగ్గు చేటు. జగన్‌ లాంటి నాయకుడికి వచ్చే ఎన్ని కల్లో ఓటమి తప్పదు.

pandu3.jpg

ప్రపంచ దేశాల్లోనే చంద్రబాబు అంటే ఒక విజన్‌

: ఇందిర, న్యాయవాది, బళ్లారి,

ప్రపంచ దేశాల్లోనే చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడు, చంద్రబాబు అంటే ప్రపంచ దేశాలు కూడా గౌరవిస్తాయి. కానీ ఏపీ ముఖ్యమంత్రి సైకో జగన్‌ చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేయడం దుర్మార్గం. చంద్రబాబు బయట ఉంటే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో జగన్‌ ఇలా అక్రమ కేసులు బనాయించారన్నారు. చంద్రబాబు పరిపాలనాధక్షుడని, ప్రజాస్వామ్యం అంటే చంద్రబాబుకు ఎంతో గౌరవం అన్నారు. చంద్రబాబును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలి. రాష్ట్రపతి, గవర్నరు కూడా జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యం కాపాడాలి. అంతే కాకుండా జైల్లో చంద్రబాబుకు భద్రత లేదని ఆయన భార్య భువనేశ్వరి కూడా ఆవేదన వ్యకం చేసిందన్నారు.

ఆయన దేశ రాజకీయాలకు దిక్సూచి: కార్పొరేటర్‌ విక్కీ

తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలకే దిక్చూచి లాంటి వారు. ఎంతో దీర్ఘ దృష్టి ఉండే నాయకుడు, రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికి తరిమి కొట్టేందుకు శ్రమించిన గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడిపై అక్రమ కేసులు బనా యించి జైలులో పెట్టడం అమానుషం. అవసరం అయితే చంద్రబాబు బయటకు వచ్చే వరకూ ఆమరణ నిరాహార దీక్షలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓడించాలని ఏపీ ప్రజలను కోరుతున్నాం.

చంద్రబాబును కుట్రపూరితంగా అరెస్టు చేశారు: కమ్మ సంఘం నాయకులు

చంద్రబాబును కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారు. ప్రపంచదేశాలు కూడా గర్వించే వ్యక్తి ఆయన, ఐటీ, బీటీ, టెక్కాలజీ, విజన్‌ 2020 ఇలా ఎన్నొ టెక్కాలజీ లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఎంతో మంది నిరుద్యోగ యువకులకు స్కిల్‌ డెవలెప్‌ కల్పించి వృత్తి నైపుణ్యతను కల్పించారు. అలాంటి నాయకుడు పై సైకో జగన్‌ అక్రమ అరెస్టు చేయడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు శ్రేయోభిలాషులు, కమ్మసంఘం నాయకులు గుర్రం లాల్‌మోహన్‌, కొత్తపల్లి తిమ్మరాజులు అభిప్రాయపడ్డారు. జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని, ప్రజలు జగన్‌కు బుద్ది చెప్పే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. ఇప్పుడు ఎన్నొకలు పెట్టిన ఏపీలో టీడీపీ 150 సీట్లు పైగా గెలుస్తుందని వీరు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు కూడా జగన్‌ పాలనతో విసుగెత్తి పోయారని, చంద్రబాను సీఎం చేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు.

Updated Date - 2023-09-18T12:03:51+05:30 IST