Bangalore to Vijayawada: బెంగళూరు నుంచి విజయవాడకు రెండు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2023-07-14T11:41:18+05:30 IST

బెంగళూరులోని సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య టర్మినల్‌ నుంచి రెండు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నారు. ఈ మేరకు నైరుతి రైల్వే అధికారులు నగరంలో గురువా

Bangalore to Vijayawada: బెంగళూరు నుంచి విజయవాడకు రెండు ప్రత్యేక రైళ్లు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య టర్మినల్‌ నుంచి రెండు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నారు. ఈ మేరకు నైరుతి రైల్వే అధికారులు నగరంలో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 03248 దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి శనివారం రాత్రి 11-25కు ఎస్‌ఎంవిటి నుంచి బయల్దేరి వెళుతుంది. ఈరైలు సేవలు జులై 22న ప్రారంభమై సెప్టెంబరు 2 వరకు కొనసాగుతాయి. కాగా 03260 దానాపూర్‌ వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(Danapur Weekly Superfast Express) ప్రతి గురువారం రాత్రి 11.25కు ఎస్‌ఎంవిటి నుండి బయల్దేరి వెళుతుందిఈ రైలు సేవలు జూలై 20న ప్రారంభమై ఆగష్టు 31 వరకు కొనసాగనున్నాయి. ఈ రెండు రైళ్ళు బంగారుపేట, జోలార్‌పేట, కాట్పాడి, పెరంబూరు విజయవాడ, వరంగల్‌ మీదుగా సాగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ, వరంగల్‌ వైపు ప్రయాణించదలిచే తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఈ సేవలను వినియోగించుకోవాలని, రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని ప్రకటనలో తెలిపారు. తిరుగు ప్రయాణంలో 03247 రైలు బెంగళూరుకు శనివారం రాత్రి 1 గంటకు చేరుకోనుండగా 03259 రైలు గురువారం రాత్రి 1 గంటకు చేరుకోనుంది.

Updated Date - 2023-07-14T11:41:18+05:30 IST