Bangalore-Visakha train: సెప్టెంబరు 25 వరకు బెంగళూరు- విశాఖ రైలు
ABN , First Publish Date - 2023-07-28T13:08:50+05:30 IST
బెంగళూరు కంటోన్మెంట్ -విశాఖపట్టణం(Bangalore Cantonment - Visakhapatnam)ల మధ్య నడిచే 08544 వీక్లీ ఎక్స్‌ప్రెస్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు కంటోన్మెంట్ -విశాఖపట్టణం(Bangalore Cantonment - Visakhapatnam)ల మధ్య నడిచే 08544 వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను సెప్టెంబరు 25 విస్తరిస్తున్నట్లు నైరుతి రైల్వే నగరంలో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ప్రకటించిన ప్రకారం ఈ రైలు సేవలు జులై 31తో ముగియనున్న సంగతి విదితమే. ఈ రైలు ప్రతి సోమవారం బెంగళూరు కంటోన్మెంట్ నుంచి బయల్దేరి వెళుతుంది. కాగా విశాఖపట్టణం నుంచి 08543 రైలు ప్రతి ఆదివారం విశాఖ నుంచి బయల్దేరుతుంది. విశాఖ వైపు నుంచి ఈ రైలు సేవలు సెప్టెంబరు 24 వరకు ఉంటాయని రైల్వే ప్రకటన పేర్కొంది. కాగా ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో బెంగళూరు-బీహార్‌లోని దానాపురల మధ్య 03242 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును మరో ఐదు ట్రిప్పులను నడుపనున్నారు. ఈ రైలు బెంగళూరులోని ఎస్‌ఎంవిటి నుంచి ప్రతి ఆదివారం రాత్రి 11.25కు బయల్దేరి వెళుతుంది ఈ రైలు సేవలు జలై 30, ఆగష్టు 5, 12, 19, 26 తేదీలలో అందుబాటులో ఉంటాయని ప్రకటన పేర్కొంది. ఈ రైలు బంగారుపేట, జోలార్‌పేట, కాట్పాడి, పెరంబూరు, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో ఆగుతుందని ప్రకటనలో తెలిపారు.