Bellary: కుట్రలతోనే చంద్రబాబును ఇరికించారు..

ABN , First Publish Date - 2023-09-27T10:40:49+05:30 IST

కుట్రలతోనే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu)ను

Bellary: కుట్రలతోనే చంద్రబాబును ఇరికించారు..

- ప్రశ్నించేందుకు ప్రజలంతా ముందుకు రావాలి: ప్రవాసాంధ్రుల పిలుపు

- హగరిబొమ్మనహళ్‌లో చంద్రబాబుకు మద్దతుగా హోరెత్తిన నిరసనలు

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): కుట్రలతోనే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu)ను అక్రమ కేసుల్లో ఇరికించారని ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్‌లో నిరసనలు హోరెత్తాయి. హగరిబొమ్మనహళ్‌లో మంగళవారం కమ్మసంఘం నాయకులు, ప్రవాసాంధ్ర ప్రముఖులు వేముళ్లపల్లి సుబ్బారావు, ఎ. ఆంజనేయులు, ఎం. కాలేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జి.నాగరాజు, భాస్కర్‌రాజు తదితర నేతృత్వంలో వందలాదిగా జనం స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. స్థానిక శివాలయం నుంచి బసవేశ్వర సర్కిల్‌ వరకూ ర్యాలీగా వచ్చారు. సుమారు 4 కిలో మీటర్ల వరకూ సాగిన ర్యాలీకి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, రైతులు, తెలుగు, కన్నడ, కమ్మ సంఘాలు, వ్యాపారులు, స్థానికంగా స్థిరపడిన తెలుగువాళ్లు, ఎన్టీఆర్‌ అభిమానులు కదలి వచ్చారు.

ర్యాలీ అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి వేమళ్లపల్లి సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు ఏమి తప్పు చేశారని జైల్లో పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల కోసం పనిచేసే మంచి నాయకుడని అన్నారు. ఎంతో మంది విద్యార్థులు స్కిల్‌ డెవలప్‏మెంట్‌ ద్వారా శిక్షణ పొంది ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చంద్రబాబు ను అభిమానించే వ్యక్తుల వేలాది మంది ఉన్నారని తెలిపారు. చంద్రబాబునాయుడును రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రపూరితంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలన్నారు. లేకపోతే రాష్ట్రం జగన్‌ చేతిలో అంధకారంలోకి వెళ్లి ప్రజల భవిష్యత్తు అన్యాయమవుతుందన్నారు. కా ర్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.

pandu1.jpg

Updated Date - 2023-09-27T10:40:49+05:30 IST