Share News

Bengaluru: కేంద్రమంత్రికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు? పరిశీలిస్తున్న అధిష్టానం

ABN , First Publish Date - 2023-10-26T10:12:00+05:30 IST

రాష్ట్రంలో నిస్తేజంగా మారిన బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే దిశగా పార్టీ అధిష్టానం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌

Bengaluru: కేంద్రమంత్రికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు? పరిశీలిస్తున్న అధిష్టానం

- పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిస్తేజంగా మారిన బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే దిశగా పార్టీ అధిష్టానం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే రాష్ట్రంలో బీజేపీ పగ్గాలను ఈసారి మహిళానేతకు అప్పగించాలనే అంశాన్ని సీరియ్‌సగా పరిశీలిస్తోంది. ఇందుకు కేంద్ర మంత్రి శోభాకరంద్లాజె(Union Minister ShobhakarandlaJ) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో ఒకింత బిజీగా ఉన్న అధిష్టానం పెద్దలు అతి త్వరలోనే రాష్ట్ర బీజేపీకి ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని భావిస్తున్న కొందరు నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టనున్నారు. బీజేపీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈసారి కనీసం 10 మంది సిట్టింగ్‌ ఎంపీలకు టికెట్లు కేటాయించే అవకాశాలు లేవని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారన్నది కథనం. కేంద్ర మంత్రి శోభాకరంద్లాజెకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రాష్ట్ర పార్టీలో మెజార్టీ నేతలు సుముఖంగా ఉన్నారు. గతంలో రాష్ట్రమంత్రిగానూ, ప్రస్తుతం కేంద్రమంత్రిగానూ శోభాకరంద్లాజె తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారని రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత ఒకరు మీడియాకు చెప్పారు.

pandu1.jpg

సంఘ్‌పరివార్‌ మద్దతు కూడా శోభాకరంద్లాజెకు లభించడం ఖాయమన్నారు. మంచి వాగ్ధాటి కలిగిన ఫైర్‌ బ్రాండ్‌ శోభాకరంద్లాజెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తథ్యమన్నారు. ఒక్కలిగ కులానికి చెందిన శోభాకరంద్లాజె పార్టీ అధ్యక్షురాలైతే ఆ వర్గం ఓట్లు బీజేపీ వైపు వాలే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్న ప్రముఖ లింగాయత్‌ నేత బీఎస్‌ యడియూరప్పతో పాటు శోభాకరంద్లాజె కాంబినేషన్‌ వల్ల ఓటు బ్యాంకు బాగా పెరుగుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. పార్టీ అధ్యక్ష పదవితో పాటు శాసనసభ, విధానపరిషత్‌ ప్రతిపక్ష నేతల పదవులను కూడా సాధ్యమైనంత త్వరగా భర్తీచేసి పార్టీలో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని సంఘ్‌పరివార్‌ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 26 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి కనీసం 15 స్థానాలైనా గెలుచుకోవడం ద్వారా అధికారంలో ఉన్న కాంగ్రె్‌సకు గట్టి సవాల్‌ విసరాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2023-10-26T10:12:00+05:30 IST