Bageshwar Baba: రూ.1000 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
ABN , First Publish Date - 2023-05-19T16:57:38+05:30 IST
పాట్నా: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బాగశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిట్ ధీరీంద్ర కృష్ణ శాస్త్రికి బీహార్ పోలీసులు రూ.1,000 ఫైన్ వేశారు. చలానాను ఆయనకు పంపారు. 90 రోజుల్లో చలానా సొమ్ము చెల్లించకుండే ఆ వాహనాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా రవాణా శాఖకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది.
పాట్నా: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బాగశ్వర్ ధామ్ (Bageshwar Dham) పీఠాధిపతి పండిట్ ధీరీంద్ర కృష్ణ శాస్త్రికి (Pandit Dhirendra Krishna Shastri) బీహార్ పోలీసులు రూ.1,000 ఫైన్ వేశారు. చలానాను ఆయనకు పంపారు. 90 రోజుల్లో చలానా సొమ్ము చెల్లించకుండే ఆ వాహనాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా రవాణా శాఖకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. ఐదు రోజుల పాటు పాట్నా పర్యటన కోసం బాగేశ్వర్ బాబా ఇటీవల పాట్నా వచ్చారు.
స్వయం ప్రకటిత గాడ్‌మన్ బాగేశ్వర్ బాబా పాట్నా పర్యటనలో కారు ఫ్రంట్ సీటులో బెల్డ్ ధరించకుండా నిబంధనలను ఉల్లంఘించడంతో ఆయనకు రూ.1,000 చలనా జారీ చేసినట్టు పాట్నా ట్రాఫిక్ పోలీసులు ధ్రువీకరించారు. మే 13న పండిట్ బాగేశ్వర్ బాబా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న SUVలో ముందు సీట్లలో కూర్చుని ప్రయాణించారు. పాట్నా విమానాశ్రయం నుంచి పానాచే హోటల్‌కు కారులో వెళ్లారు. సీటు బెల్డ్ లేకుండా ప్రయాణించడం ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూలంకషంగా పరిశీలించిన పోలీసులు తివారీ, బాగేశ్వర్ బాబాకు రూ.1,000 చలనా వేశారు.
ట్రాఫిక్ ఇబ్బందులు..
పాట్నాలో పర్యటించిన బాగేశ్వర్ బాబా.. నౌబత్‌పూర్ ప్రాంతంలోని తరేత్ పాలీ మఠంలో హనుమాన్ కథను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆయన భక్తులు తరలి రావడంతో రోడ్లపై ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తాయి. నౌబత్‌పురకు దారితీసే రోడ్లపై ట్రాఫిక్ నిర్వహణకు పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మఠానికి 25 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలు మే 13 నుంచి ట్రాఫిక్ సమస్యలు చవిచూశారు.