Share News

Bihar reservations: బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్లకు గవర్నర్ ఓకే..

ABN , First Publish Date - 2023-11-21T18:15:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి బీహార్ ప్రభుత్వం లాంఛనంగా పెంచింది. పెంచిన కోటాకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి ఇచ్చారు.

Bihar reservations: బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్లకు గవర్నర్ ఓకే..

పాట్నా: రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు (Deprived castes) రిజర్వేషన్లను(Reservations) 50 శాతం నుంచి 65 శాతానికి బీహార్ ప్రభుత్వం లాంఛనంగా పెంచింది. పెంచిన కోటాకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి ఇచ్చారు. ప్రతిపాదిత మార్పులక ఆమోదం తెలుపుతూ బీహార్ రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ పోస్ట్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు, బీహార్ రిజర్వేషన్ (అడ్మిషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్) సవరణ బిల్లు-2023కు గవర్నర్ ఆమోదం తెలుపుతూ వాటిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.


బీహార్ ప్రభుత్వం ఇటీవల జరిపిన కులగణన వివరాలను అసెంబ్లీకి సమర్పించడంతో పాటు కోటా బిల్లులకు ఆమోదం పొందింది. బిల్లుల్లో చేసిన సవరణల ప్రకారం వివిధ కేటగిరిలకు రిజర్వేషన్ పెంపు జరిగింది. ఆ ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సీ) 16 నుంచి 20 శాతం, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు (ఎస్‌టీ) 1 శాతం నుంచి 2 శాతానికి, ఈబీసీలకు 18 నుంచి 25 శాతం, ఓబీసీలకు 15 నుంచి 18 శాతం రిజర్వేషన్ పెంచారు. ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్‌కు ప్రభుత్వం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌తో కలిసి రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల మొత్తం 75 శాతానికి చేరింది.

Updated Date - 2023-11-21T18:15:40+05:30 IST