Bihar : పర్యావరణ పరిరక్షణ కోసం బిహార్ మంత్రి వినూత్న ప్రయత్నం

ABN , First Publish Date - 2023-02-22T21:01:46+05:30 IST

బిహార్ పర్యావరణ శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) బుధవారం సచివాలయానికి

Bihar : పర్యావరణ పరిరక్షణ కోసం బిహార్ మంత్రి వినూత్న ప్రయత్నం
Tej Pratap Yadav

పాట్నా : బిహార్ పర్యావరణ శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) బుధవారం సచివాలయానికి సైకిలుపై వచ్చారు. ఆయన చుట్టూ ఆయన భద్రతా సిబ్బంది, విలేకర్లు ఉన్నారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ, తనకు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) కలలో కనిపించారని, ఆయన నుంచి స్ఫూర్తిని పొంది, తాను సైకిలుపై సచివాలయానికి వచ్చానని చెప్పారు.

తెలుపు రంగు కుర్తా, వెయిస్ట్ కోట్, టాప్ ధరించిన తేజ్ ప్రతాప్ సచివాలయానికి సైకిలుపై రావడం అందరినీ ఆకర్షించింది. పర్యావరణ పరిరక్షణ కోసం తాను సైకిలుపై ప్రయాణిస్తున్నాని, దివంగత ములాయం సింగ్ యాదవ్ నుంచి తాను స్ఫూర్తి పొందానని ఆయన చెప్పారు.

బృందావనానికి వెళ్లినట్లు తనకు కల వచ్చిందని చెప్పారు. అక్కడ నేతాజీ (ములాయం సింగ్)ను చూశానని చెప్పారు. ఆయనను, ఆయన స్వగ్రామాన్ని చూడాలని ఉందని ఆయనకు చెప్పానన్నారు. తాము సైకిళ్లపై వెళ్లామన్నారు. దీంతో తాను సచివాలయానికి సైకిలుపై వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం, నేతాజీ సందేశాన్ని వ్యాపింపజేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

US presidential race : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో భారతీయుడు... అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వివేక్ రామస్వామి...

Kohinoor Diamond: బ్రిటన్ మహారాణి కేమిలా కోహినూర్ వజ్రాన్ని వద్దనడానికి కారణం ఇదేనా..

Updated Date - 2023-02-22T21:01:50+05:30 IST