Bitragunta Express: 24నుంచి బిట్రగుంట ఎక్స్‌ప్రెస్ రద్దు
ABN , First Publish Date - 2023-07-23T11:04:15+05:30 IST
రైల్వే లైన్లలో మరమ్మతులు చేపట్టనున్న కారణంగా ఈనెల 24నుంచి 28వ తేదీ వరకు చెన్నై సెంట్రల్ - బిట్రగుంట(Chennai Central - Bitra
చెన్నై,(ఆంధ్రజ్యోతి): రైల్వే లైన్లలో మరమ్మతులు చేపట్టనున్న కారణంగా ఈనెల 24నుంచి 28వ తేదీ వరకు చెన్నై సెంట్రల్ - బిట్రగుంట(Chennai Central - Bitragunta) మధ్య తిరిగే ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్‌కు ఉదయం 4.45 గంటలకు బయలుదేరే ఎక్స్‌ప్రెస్ (17237), చెన్నై సెంట్రల్ నుంచి బిట్రగుంటకు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరే ఎక్స్‌ప్రెస్ (17238)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి తిరిగే కొన్ని రైళ్లను కూడా దక్షిణ రైల్వే రద్దు చేసింది. ఆ వివరాలిలా వున్నాయి...
- ఈనెల 24నుంచి 30వ తేదీ వరకు ఉదయం 10.55 గంటలకు బయలుదేరే తిరుపతి - కాట్పాడి ప్యాసింజర్ (07581), సాయంత్రం 3 గంటలకు కాట్పాడి - తిరుపతి ప్యాసింజర్ (0766) రద్దు
- ఈనెల 24నుంచి 30వ తేదీ వరకు ఉదయం 5.30 గంటలకు బయలుదేరే విల్లుపురం - తిరుపతి ఇంటర్‌సిటీ స్పెషల్ (06854) కాట్పాడి వరకు మాత్రమే.
- ఈనెల 24నుంచి 30వ తేదీ వరకు మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరాల్సిన తిరుపతి -విల్లుపురం ఇంటర్‌సిటీ (06853) సాయంత్రం 4.40 గంటలకు కాట్పాడి నుంచి బయలుదేరనుంది.